పిచ్చి..పిచ్చి రాతలు రాయకండి: అషూరెడ్డి
ఇంటర్నెట్ డెస్క్: సామాజిక మాధ్యమాల్లో తన మీద వస్తున్న వార్తలపై నటి అషూరెడ్డి ఘాటుగా స్పందించింది. తాను పవన్‌కల్యాణ్‌కు పెద్ద అభిమానినని, ఎప్పటికైనా అభిమానిగానే ఉంటానని స్పష్టం చేసింది. దయచేసి తప్పుడు వార్తలు రాసి తన పేరు చెడగొట్టవద్దని ఆమె కోరింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. తన సినిమాలో నటిస్తున్న నటీనటులను, టెక్నీషియన్లను పవన్‌కల్యాణ్ ఇటీవల సత్కరించి వాళ్లకు లేఖలు అందించారు. ఈ క్రమంలో అషూరెడ్డికి కూడా లేఖ ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్‌తో అషూరెడ్డి ఒక ఫొటో దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. పవన్‌కల్యాణ్ నా ఫస్ట్‌లవ్ అంటూ అందులో రాసుకొచ్చింది. దీంతో ఆమెపై సోషల్‌మీడియాలో అభ్యంతరకరమైన వార్తలు వ్యాపించాయి. అయితే.. దీనిపై ఆమె తాజాగా స్పందించింది.
‘ఈ మధ్య సోషల్ మీడియాలో నాపై పిచ్చిరాతలు రాస్తున్నారు. నాకు పవన్‌కల్యాణ్‌గారు దేవుడితో సమానం. ఆయనకు నేను పెద్ద అభిమానిని. అభిమానం అంటే ఎప్పటికైనా అభిమానమే.. దాన్ని వేరేలా ఆపాదిస్తూ పిచ్చి రాతలు రాస్తున్నారు. అదైతే మంచిది కాదు. సానుకూలతను పంచాల్సిన వాళ్లే చెడును విస్తరిస్తూ వేరేవాళ్ల పేరును బదనాం చేస్తూ రాయడం సరైంది కాదు. దీని వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. ఇలాంటి వాటి వల్ల పవన్‌కల్యాణ్‌గారు తన అభిమానులను కలవాలంటేనే ఆలోచించే స్థితికి తీసుకెళుతున్నారు. నిజానికి ఇలాంటి వార్తలపై స్పందించకూడదు. కానీ.. నాకు ఓపిక నశించి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మీరనుకున్నట్లు నేను ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒక అభిమాని అంటే చచ్చేంతవరకూ అభిమానిలాగే ఉంటారు. అంతేగాని ఇంకేమీ ఉండదు. మీ రాతల వల్ల ఉన్న పేరును దయచేసి నాశనం చేయవద్దు’ అంటూ ఆమె పేర్కొంది.
గతంలో పెట్టిన పోస్టులో ఆమె ఏం రాసిందంటే.. ‘‘నా దేవుడిని మళ్లీ కలుసుకున్నాను. ఆయన నన్ను, నా పచ్చబొట్టును ఇంకా గుర్తుంచుకున్నారు. నాకు టీ కూడా ఇచ్చారు. ఆయనతో రెండు గంటల పాటు సంభాషణ సాగింది. నాకు ఇదొక మధురమైన జ్ఞాపకం. బయలుదేరేటప్పుడు ఆయన నాకో లేఖ ఇచ్చాడు. ‘మీరు ఎల్లప్పుడూ నా ఫస్ట్.. లవ్ పవన్ కల్యాణ్’’ అంటూ ఆమె ఆ పోస్టులో రాసుకొచ్చింది. దీంతో అక్కడి నుంచి అషూపై ట్రోలింగ్స్ మొదలయ్యాయి.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- పవన్ చూసి నిర్మాతనని మర్చిపోయా: దిల్ రాజు
-
ఆ చిత్రాల రికార్డులను బీట్ చేసిన ‘పుష్ప’ టీజర్
-
దేశం గురించి రోడ్లు చెప్పేస్తాయ్ సర్!
- కంగనా ‘తలైవి’ వాయిదా
-
ఏప్రిల్ 12న 'ఖిలాడి' టీజర్ విడుదల
గుసగుసలు
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
- ‘మాస్టర్’ దర్శకుడితో ప్రభాస్ చిత్రం!
- నితిన్‌తో హైబ్రీడ్ పిల్ల?
- మా క్రమశిక్షణ సంఘానికి చిరంజీవి రాజీనామా!
-
మహష్ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
-
పవన్‌తో నటిస్తున్నానంటే నమ్మబుద్ధి కాలేదు
కొత్త పాట గురూ
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్
-
‘ఏ జిందగీ’ అంటున్న అఖిల్.. పూజా