close
Published : 10/04/2021 13:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పవన్‌ అభిమాని తీరుపై అనసూయ అసంతృప్తి

వీడియో షేర్‌ చేసిన నటి

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌ అభిమాని ప్రవర్తనపై నటి అనసూయ అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్‌కల్యాణ్‌ నటించిన ‘వకీల్‌సాబ్‌’ ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి స్క్రీన్‌ వద్దకు చేరుకుని దానిపై రక్తంతో పవన్‌ పేరు రాశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై అనసూయ స్పందించారు. ‘ఇది భయానకమైన చర్య!! ఇలాంటి చర్యలను ఎదుటివాళ్లు ఎలా చూస్తూ ఊరుకున్నారు. ఇలాంటి పనుల వల్ల మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆలోచించారా? అభిమానం చాటుకోవడానికి ఎన్నో దారులున్నాయి. కొంచెం బాధ్యతాయుతంగా నడుచుకుంటే అందరికీ బాగుంటుంది’ అని ఆమె పేర్కొన్నారు.

సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రస్తుతం తాను నాలుగు సినిమాల్లో నటిస్తున్నట్లు చెప్పారు. ఏ భాష చిత్రమైనా సరే మంచి పాత్ర వస్తే తప్పకుండా ఓకే చేస్తానని అన్నారు. అలాగే తాను నటించిన మరో రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం మరో నెటిజన్‌.. ‘సినిమాల్లో మీకు వచ్చే అవకాశాల గురించి మీ భర్త, పిల్లలతో చర్చిస్తారా? ఒకవేళ వాళ్లు నో చెబితే ఏం చేస్తారు?’ అని ప్రశ్నించగా.. ‘నా పిల్లలతో చెప్పను. ఎందుకంటే వాళ్లు ఇంకా చిన్నవాళ్లే. నా భర్త భరద్వాజ్‌తో ఎక్కువగా చర్చిస్తుంటాను. కానీ తుది నిర్ణయం మాత్రం నాదే’ అని ఆమె సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే పవన్‌ అభిమానికి సంబంధించిన వీడియోని అను షేర్‌ చేశారు.


CNeJsS_HRpv

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని