గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

సినిమాల్లోకి బిగ్‌బీ మనవడు?

ముంబయి: ప్రస్తుతం బాలీవుడ్‌లో బంధుప్రీతి హాట్‌ టాపిక్‌గా మారింది. చిత్రపరిశ్రమలో ప్రముఖుల వారసులకే అవకాశాలు ఎక్కువ వస్తున్నాయని, సినీ నేపథ్యంలేని వారికి ప్రోత్సాహం అందట్లేదని ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మరోవైపు వారసుల సినీరంగ ప్రవేశాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబం నుంచి మరో వ్యక్తి వెండితెరకు పరిచయం కాబోతున్నట్లు సమాచారం.

అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబంలో దాదాపు అందరూ నటులే. ఆయన సతీమణి జయా బచ్చన్‌ అప్పట్లో నటిగా మెప్పించారు. అమితాబ్‌ కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌.. కోడలు ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ కూడా నటులే. తాజాగా అమితాబ్‌ మనవడు.. కుమార్తె శ్వేతా బచ్చన్‌ నందా కుమారుడు అగస్త్య నందా హీరోగా మారబోతున్నాడట. చిన్నతనం నుంచే అతడికి సినిమా రంగంలోకి రావాలని కోరిక ఉందట. అమితాబ్‌ బచ్చన్‌ మనవడు కావడం.. సోషల్‌మీడియాలోనూ అగస్త్య నందాకు మంచి ఫాలోయింగ్‌ ఉండటంతో సినీ అవకాశాలు వరసకడుతున్నాయి. ప్రస్తుతం అగస్త్య సినిమా కథలు వింటున్నాడని, ఏదైన కథ నచ్చితే హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని బీటౌన్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. మరోవైపు అగస్త్య సోదరి, అమితాబ్‌ మనవరాలు నవ్య నవేలీ నందా మోడల్‌గా రాణించడంతోపాటు.. ఆరోగ్య సంరక్షణ రంగంలో సేవలు అందించేందుకు సంస్థను ఏర్పాటు చేసింది. 

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని