Pushpa: ‘పుష్ప’కు లీకుల గోల.. ఆ ఫొటోను కూడా వదలని నెటిజన్లు! - allu ajrun pushpa movie shoot videos goes viral
close
Published : 17/09/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pushpa: ‘పుష్ప’కు లీకుల గోల.. ఆ ఫొటోను కూడా వదలని నెటిజన్లు!

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప’. రష్మిక కథానాయిక. ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కాకికాడ పోర్టు, మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతోంది.

కాగా, ‘పుష్ప’కు సంబంధించి లీకుల బెడద ఎక్కువైంది. అవుట్‌డోర్‌ షూటింగ్‌ కావడంతో జనాలను అదుపు చేయటం చిత్ర బృందానికి కాస్త కష్టమవుతోంది. మరోవైపు కొందరు యువకులు సినిమా సెట్‌, బన్ని నటిస్తున్న సన్నివేశాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ‘ఫొటోలు, వీడియోలు తీసినచో సెల్లు ఫోన్‌ పగలగొట్టబడును’ అని బోర్డులు ‘పుష్ప’ షూటింగ్‌ స్పాట్‌లో కనిపిస్తున్నాయి. వాటిని కూడా ఫొటో తీసి పంచుకుంటున్నారు. ఇటీవల రోడ్డు పక్కన ఉండే చిన్న హోటల్‌లో బన్ని అల్పాహారం తీసుకుని బయటకు వస్తున్న వీడియో కూడా వైరల్‌గా మారింది. మరోవైపు బన్ని-రష్మికల మధ్య జరిగే ఓ సీన్‌ను కూడా లీక్‌ చేసి పడేశారు. వీటికి ఎలా అడ్డుకట్ట వేయాలా? అని చిత్ర బృందం తలపట్టుకుంటోంది.

దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా మొదటి భాగం డిసెంబరులో విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తోంది.














మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని