close
Published : 10/07/2020 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కెమెరా ముందుకొచ్చిన ఆయుష్మాన్‌‌ ఖురానా

చండీగఢ్‌‌‌: లాక్‌డౌన్‌ కారణంగా సినీతారలంతా మూడు నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. షూటింగ్స్‌ ఎప్పుడు ప్రారంభమవుతాయా అని ఎదురుచూస్తున్నారు. అయితే బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా మాత్రం అప్పుడే ఓ షూటింగ్‌లో పాల్గొన్నాడు. అదేంటీ ఇంకా కేంద్రం సినిమా షూటింగ్‌కు అనుమతే ఇవ్వలేదు కదా.. ఎలా? అని ఆశ్చర్యపోకండి. అతడు పాల్గొంది సినిమా షూటింగ్‌లో కాదు.. ఓ లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌ కోసం చిత్రీకరించిన ప్రచారం చిత్రంలో!

ఇటీవల తన తల్లిదండ్రులను చూసేందుకు చండీగఢ్‌ వెళ్లిన ఆయుష్మాన్.. అక్కడే ప్రచార చిత్రం షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో కరోనా సంక్షోభంలో ఏ విధంగా షూటింగ్‌ చేస్తారో తెలుసుకున్నాడట. ఎనిమిది గంటలపాటు ఆయుష్మాన్‌ ఆ షూటింగ్‌లో పాల్గొన్నాడు. లాక్‌డౌన్‌ నిబంధనలు, సామాజిక దూరం పాటిస్తూ.. మాస్కులు, గ్లౌజ్‌లు ధరించి కేవలం 18 మందితో షూటింగ్‌ను పూర్తి చేశారు. కరోనా పరిస్థితుల్లో షూటింగ్‌ చేయడంపై ఆయుష్మాన్‌ స్పందిస్తూ ‘‘కొన్ని నెలల తర్వాత షూటింగ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం నటులమంతా ఇళ్లలో ఉన్నాం. తిరిగి మాకిష్టమైన పనులు చేసుకోవడానికి ఎదురుచూస్తున్నాం. అందరూ తమకు తాము సినిమా షూటింగ్స్‌కు ఎలా సన్నద్ధమవుతున్నారో చూశా. సంక్షోభం పోయి సాధారణ పరిస్థితులు వస్తాయి. మేమంతా షూటింగ్‌ ప్రాంతంలో జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్‌లో పాల్గొంటాం’’ అని ఆయుష్మాన్‌ చెప్పుకొచ్చాడు.

లాక్‌డౌన్‌కు ముందు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి ఆయుష్మాన్‌ ఖురానా ‘గులాబో సితాబో’ చిత్రంలో నటించాడు. ఈ సినిమా థియేటర్‌లో విడుదల కావాల్సి ఉండగా.. థియేటర్లపై తెరవడంపై నిషేధం కొనసాగుతుండడంతో ఓటీటీలో విడుదల చేశారు. సినిమాపై మిశ్రమ స్పందన వచ్చినా.. అమితాబ్‌, ఆయుష్మాన్‌ ఖురానా నటనకు మంచి మార్కులు పడ్డాయి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని