‘లవ్‌స్టోరి’కి అదే స్ఫూర్తి - Telugu News Success Celebrations Of LoveStory
close
Updated : 25/09/2021 07:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘లవ్‌స్టోరి’కి అదే స్ఫూర్తి

‘‘ఈ సినిమాని చూసి ఒక ఆడపిల్ల తాను పడుతున్న ఇబ్బందుల్ని బయటికి చెప్పుకోగలిగే ధైర్యం తెచ్చుకుంటే...వివక్షకు గురైన ఓ ఊరి అబ్బాయి ఇది నా కథ అని చెప్పుకుంటే మాకు ఇంకా పెద్ద విజయం సాధించినట్టుగా భావిస్తాం’’ అన్నారు శేఖర్‌ కమ్ముల. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌స్టోరి’. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకి చక్కటి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సంబరాల్ని జరిపింది. శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ‘‘నిర్భయ ఘటన తర్వాత సమాజానికి మంచిని చెప్పే సినిమా చేయాలనుకున్నా. ఆ తర్వాత పాఠశాలలు, కళాశాలలకి వెళ్లి అవగాహన కార్యక్రమాల్ని నిర్వహించాం. అక్కడే ఈ కథకి స్ఫూర్తి దొరికింద’’న్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు నారాయణదాస్‌ నారంగ్‌, రామ్‌మోహన్‌రావు, సునీల్‌ నారంగ్‌ ఇతర చిత్రబృందం పాల్గొంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని