‘మా’ ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దు - Telugu News Manchu Vishnu latest Press meet On MAA Elections
close
Updated : 25/09/2021 06:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మా’ ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దు

మూవీ ఆర్టిస్ట్‌ సోసియేషన్‌ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవద్దని మంచు విష్ణు అన్నారు. ఇక్కడ ‘మా’ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయని, రాజకీయాలతో అసోసియేషన్‌కు సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న మంచు విష్ణు గురువారం తన ప్యానల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తన ప్యానల్‌ సభ్యులతో కలిసి శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. ‘మా’ ప్రెసిడెంట్‌ అనేది బిరుదు కాదని, ఒక బాధ్యతాయుతమైనదని మంచు విష్ణు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌పై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు మాట్లాడుతూ ‘‘‘మా’లో ఎన్నో సవాళ్లున్నాయి. వాటన్నింటిని సమర్థంగా ఎదుర్కొనే ప్యానల్‌ మాది. ప్రత్యర్థి ప్యానెల్‌లో మంచి నటులున్నారు. కానీ, ‘మా’ అసోసియేషన్‌లో పనిచేసేంత సామర్థ్యం వాళ్లకు లేదు. ఈ విషయంలో నాకన్నా ఎవరూ బాగాపనిచేయలేరు. వాళ్ల గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ‘మా’ ఒక ఛారిటీ ఆర్గనైజేషన్‌ కాదని ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ అంది. పెద్దలకు పింఛన్‌ ఇవ్వడాన్ని ఛారిటీ అని ఎలా అంటారు? అది మన బాధ్యత. అసోసియేషన్‌లో ఉన్న 900 మందికి లైఫ్‌, మెడికల్‌ ఇన్సూరెన్స్‌ ఇవ్వడమే నా ప్రాధాన్యత. ఎడ్యుకేషన్‌ పాలసీ గురించి ఏమైనా మాట్లాడారా, ఆ ప్యానెల్‌లో ఉన్న ఎవరైనా దీనిపై మాట్లాడటానికి వస్తే నేను సిద్ధం. 900 మంది ఉన్న అసోసియేషన్‌ 2వేల మంది కావాలి, కొత్త వాళ్లను ఇండస్ట్రీలోకి రానివ్వాలి. నిర్మాత దేవుడితో సమానం. వాళ్లను గౌరవించాలి, డిమాండ్‌ చేయకూడదు. నాకు బాబుమోహన్‌, పృథ్వీలాంటి సీనియర్‌ నటుల అనుభవం కావాలి. శివ బాలాజీ లాంటి యువరక్తం మా అభివృద్ధికి అవసరం. ‘మా’ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవద్దు. ఇక్కడ ‘మా’ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి. రాజకీయాలతో అసోసియేషన్‌కు సంబంధం లేదు. చంద్రబాబు గారు నాన్నగారి బంధువు. జగన్‌ మా బావ. నాక్కూడా రాజకీయాలు తెలుసు. ‘విష్ణును ఎన్నికల నుంచి తప్పుకోమనండి’ అని నాన్నకు ఒకరు ఫోన్‌ చేశారు. ఆ తర్వాతే నాన్న రంగంలోకి దిగారు. అసోసియేషన్‌లో ఉన్న 600 మందికి ఫోన్‌ చేసి విష్ణు ఎన్నికల్లో దిగుతున్నాడు మీ మద్దతు కావాలి అని అడిగారు. అంతకు ముందు వరకు నాన్న అసోసియేషన్‌ విషయంలో జోక్యం చేసుకోలేదు. ఈ ఎన్నికలు చాలా ఇబ్బందికరమైనవి. చివరి క్షణం వరకు ఏకగ్రీవం కోసం ప్రయత్నించా’’ అన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని