గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

మీకు తెలుసా ..‘సింగమ్‌’ దర్శకుడి కరోనా సాయం! 

కరోనా వేళ.. పోలీసులకు బాసటగా బాలీవుడ్‌ దర్శకుడు

ముంబయి: దేశం నుంచి కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కష్టపడుతూ ముందు వరుసలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు. రేయింబవళ్లు కుటుంబాలను వదిలేసి మరీ ప్రజా సేవలో వారు అంకితమవుతున్నారు. అలాంటి వారికి బాసటగా నిలిచారు బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌ శెట్టి.  ‘సింగమ్’‌, ‘సింబా’ సినిమాలతో పోలీస్‌ను పవర్‌ఫుల్‌గా చూపించిన రోహిత్‌ నిజమైన పోలీసులకు పెద్ద సాయం చేశారు. విధుల్లో ఉన్న పోలీసులకు విశ్రాంతి తీసుకునేందుకు, భోజనం చేసేందుకు నగరంలోని 11 హోటళ్లలో వంద రోజుల నుంచి సౌకర్యాలను కల్పించారు. సహకారం అందిస్తున్నందుకు ముంబయి పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌ బీర్‌ సింగ్‌ ట్విటర్‌ వేదికగా రోహిత్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

‘‘మేమంతా రోహిత్‌ శెట్టికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కొవిడ్‌ విజృంభిస్తున్న సమయంలో పురుష, మహిళా పోలీసులకు మద్దతుగా నిలుస్తూ సాయం చేస్తున్నారు. విధుల్లో ఉన్న సిబ్బంది కోసం 11 హోటల్స్‌లో వసతి కల్పించారు. కరోనా సమయంలో ముంబయి వీధుల్లో పని చేస్తున్నవారికి బాసటగా నిలిచారు’’ అని కమిషనర్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు. 

పోలీసు నేపథ్యంలో రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహించిన ‘సూర్యవంశి’ సినిమా విడుదల కోసం సిద్ధంగా ఉంది. అక్షయ్‌ కుమార్‌, కత్రినా కైఫ్‌ హీరోహీరోయిన్లు. అయితే కరోనాతో థియేటర్లు ఓపెన్‌ అయ్యే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. కనీసం మరో రెండు నెలలైనా వేచి చూడాల్సిందే.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని