Konda Polam: అడవిలో  మానవ మృగాలతో పోరాటం - Konda Polam Trailer
close
Updated : 28/09/2021 06:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Konda Polam: అడవిలో  మానవ మృగాలతో పోరాటం

‘ఉప్పెన’ విజయం తర్వాత వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటించిన చిత్రం ‘కొండపొలం’. ప్రముఖ దర్శకుడు క్రిష్‌ తెరకెక్కించారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మించారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. అటవీ నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్‌ చిత్రాన్ని.. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా రూపొందించారు. ఈ సినిమా వచ్చే నెల 8న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన కటారు రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్‌ను పరిచయం చేయడంతో ట్రైలర్‌ ప్రారంభమైంది. అతను హైదరాబాద్‌కు వచ్చి నాలుగేళ్లు కోచింగ్‌ తీసుకోవడం.. ఏ ఉద్యోగం దొరక్క తన ఊరికి తిరిగి వెళ్లిపోయి వంశ వృత్తిని స్వీకరించడం.. ఈ క్రమంలోనే తన తాత మాట ప్రకారం గొర్రెల్ని తీసుకుని తండ్రితో కలిసి కొండపొలంకు వెళ్లడం లాంటివి ప్రచార చిత్రంలో ఆసక్తికరంగా చూపించారు. అయితే కొండపొలం వెళ్లిన తర్వాత అడవుల్లో క్రూర మృగాలతో పాటు ప్రమాదకరమైన మానవ మృగాల నుంచి హీరో తన గొర్రెలను, కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లను ఎలా దాటాడు? అనేది తెరపై చూడాలి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని