మంగళవారం, జూన్ 02, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

నా కుటుంబం గురించి ఆందోళన చెందుతున్నా

జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌

ముంబయి: కరోనావైరస్‌ వ్యాప్తిస్తున్న నేపథ్యంలో తన తల్లిదండ్రుల గురించి ఎంతో ఆందోళనకు గురి అవుతున్నానని బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ తెలిపారు. శ్రీలంకకు చెందిన ఆమె సినిమాల్లో నటించాలనే ఉద్దేశంలో ముంబయికి వచ్చి ఇక్కడే స్థిరపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జాక్వెలిన్‌ ముంబయిలో ఉండగా.. ఆమె తల్లిదండ్రులు బహ్రెయిన్‌లో ఉంటున్నారు. కొవిడ్‌-19 రోజురోజూకీ విజృంభిస్తోన్న నేపథ్యంలో విదేశీ ప్రయాణాలను వివిధ దేశాలు అనుమతించడంలేదు. దీంతో జాక్వెలిన్‌ తన తల్లిదండ్రులను కలుసుకోలేక వారి ఆరోగ్యం గురించి ఆందోళనకు గురవుతున్నానని ఆమె ఓ ఆంగ్ల పత్రికతో తెలియజేశారు.

‘ఇలాంటి పరిస్థితుల్లో నా తల్లిదండ్రులు నాతో ఉంటే బాగుండేదనిపిస్తుంది. నేను ఇక్కడే ఉన్నాను కానీ.. వాళ్లు ఎలా ఉన్నారో, వాళ్ల ఆరోగ్యం ఎలా ఉందో అని ఆందోళన చెందుతున్నాను. ఇంకో విషయం ఏమిటంటే.. నేను ఇక్కడ ఒక్కదానినే ఉన్నానని వాళ్లు కూడా నా గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులతో కలిసి ఉన్నా వారందరూ ఎంతో అదృష్టవంతులు. పెద్దవాళ్లకు ఇప్పుడు మన ప్రేమాభిమానాలు ఎంతో అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లకి మనం తోడుగా ఉండాలి.’ అని జాక్వెలిన్‌ తెలిపారు.

అనంతరం ఆమె లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లో ఉండడం గురించి తెలియచేస్తూ... ‘ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. లాక్‌డౌన్‌ మొదటివారం నాకెంతో భారంగా అనిపించింది. సినిమా సెట్స్‌కి వెళ్లలేను కాబట్టి సోషల్‌మీడియా వేదికగా నా అభిమానులతో టచ్‌లో ఉన్నాను.’ అని పేర్కొన్నారు.

Tags:
కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)