Gully Rowdy: ఇంటిల్లిపాది.. నవ్వుకునే సినిమా ‘గల్లీరౌడీ’ - Gully Rowdy pre release event
close
Updated : 16/09/2021 12:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Gully Rowdy: ఇంటిల్లిపాది.. నవ్వుకునే సినిమా ‘గల్లీరౌడీ’

‘‘థియేటర్లలోనే సినిమా చూడాలనుకునే వాళ్లందరికీ పండగ లాంటి చిత్రం మా ‘గల్లీరౌడీ’. ఇంటిల్లిపాది కలిసి చూసే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఆద్యంతం కడుపుబ్బా నవ్విస్తుంది. కచ్చితంగా అందరినీ అలరిస్తుంది’’ అన్నారు నటుడు రాజేంద్రప్రసాద్‌. సందీప్‌ కిషన్‌, నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రమిది. జి.నాగేశ్వర రెడ్డి   దర్శకుడు. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాత. కోన వెంకట్‌ సమర్పిస్తున్నారు. రాజేంద్ర   ప్రసాద్‌, బాబీ సింహా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 17న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ డిప్యుటీ స్పీకర్‌ కోన రఘుపతితో పాటు   వి.వి.వినాయక్‌, కోన వెంకట్‌, బాబీ, బుచ్చిబాబు సాన, శివ నిర్వాణ, విష్వక్‌ సేన్‌, తేజ సజ్జా, భవిన్‌ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ప్రారంభమవడానికి ముఖ్య కారణం సందీప్‌. ఇది మేము అనుకున్నట్లుగా రావడానికి ప్రధాన కారణం నిర్మాతలు సత్యనారాయణ, కోన వెంకట్‌’’అన్నారు. చిత్ర నిర్మాత ఎం.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘కచ్చితంగా ఈ చిత్రం పెద్ద హిట్‌ అవుతుంది. ఇది ఫెయిలైతే మళ్లీ మరో చిత్రం చేయనని చెబుతున్నా’’ అన్నారు. ‘‘అందరినీ నవ్వించే ఉద్దేశంతో తీసిన సినిమా గల్లీరౌడీ’’ అని అన్నారు సందీప్‌ కిషన్‌.




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని