శుక్రవారం, మే 29, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

రణ్‌వీర్‌కు HUSBAND లేబుల్‌ వేసిన దీపిక

లాక్‌డౌన్‌లో నటి ఏం చేస్తున్నారంటే..

ముంబయి: బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె తన భర్త రణ్‌వీర్‌ సింగ్‌ నుదిటిపై HUSBAND లేబుల్‌ వేశారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆమె ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం కరోనావైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్‌డౌన్‌ విధించిన విషయం విధితమే. వృత్తిపరమైన పనులన్నీ నిలిచిపోవడంతో సినీ తారలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఎలాంటి వర్క్‌ టెన్షన్స్‌ లేకపోవడంతో దీపిక.. ఆమె భర్త రణ్‌వీర్‌ ముంబయిలోని తమ నివాసంలో చాలా సరదాగా గడుపుతున్నారు. దీంతో దీపిక.. ఇళ్లకే పరిమితమైనప్పుడు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియజేస్తూ ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు, వీడియోలను షేర్‌ చేస్తున్నారు. ఇటీవల వంటగదిలో ఉండే సామగ్రిపై లేబుల్స్‌ అతికించడంలాంటి పనులను ఇలాంటి సమయాల్లో చేసుకోవచ్చు అని తెలియజేశారు. ఇదిలా ఉండగా తాజాగా దీపిక.. నిద్రిస్తున్న తన భర్త నుదిటిపై HUSBAND (భర్త) అనే లేబుల్‌ను అతికించింది. దీనికి సంబంధించిన ఫొటోను సైతం ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది. ప్రస్తుతం నెట్టింట్లో ఈ ఫొటో చక్కర్లు కొడుతోంది.

ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘ఛపాక్‌’ చిత్రంలో దీపిక నటించారు. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రానికి మేఘనా గుల్జర్‌ దర్శకత్వం వహించారు. దీపిక-రణ్‌వీర్‌ కలిసి ‘83’ చిత్రంలో నటించారు. భారత క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రమిది. కరోనా వైరస్‌ కారణంగా ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని కొంతకాలంపాటు వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

 

 

 


Tags:
కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)