శుక్రవారం, మే 29, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

కరోనాపై పోరుకు బాలయ్య విరాళం

రూ. కోటి 25 లక్షలు ప్రకటించిన హీరో

హైదరాబాద్‌: కరోనా వైరస్‌పై పోరాటానికి టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కోటి 25 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ప్రపంచదేశాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనా కట్టడికి అనేక చర్యలు చేపట్టాయి. కరోనా కట్టడి కోసం పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు గత కొన్నిరోజుల నుంచి సినీ తారలు తమవంతు ఆర్థికసాయం అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రూ.1.25 కోట్లు విరాళంగా అందించనున్నట్లు ప్రకటించారు. అందులో రూ.50లక్షలు తెలంగాణ సీఎం సహాయ నిధికి, మరో రూ.50 లక్షలు ఆంధ్రప్రదేశ్‌ సీఎం సహాయనిధికి అందించనున్నారు. తెలుగు సినీ కార్మికుల సహాయార్థం చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీసీ(కరోనా క్రైసిస్‌ ఛారిటీ)కి రూ.25 లక్షలు ప్రకటించారు. ఈ మేరకు రూ.25లక్షల చెక్కును ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు సి.కల్యాణ్‌కు అందించారు. ప్రజలు ఇళ్లకే పరిమితమై తగిన జాగ్రత్తలు పాటించి కరోనాను అరికట్టాలని బాలకృష్ణ సూచించారు.

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి, సినీ కార్మికుల ఛారిటీకి విరాళం అందించిన బాలకృష్ణకు అగ్ర కథానాయకుడు చిరంజీవి ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ప్రతి కష్ట సమయంలోనూ ప్రజలను ఆదుకోవటం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే మీరెప్పుడు తోడుంటారు’’ అని ట్వీట్‌ చేశారు.

మంత్రి కేటీఆర్‌కు చెక్‌ అందించిన బాలయ్య

తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించిన రూ.50లక్షల విరాళానికి సంబంధించిన చెక్‌ను నందమూరి బాలకృష్ణ స్వయంగా మంత్రి కేటీఆర్‌కు అందించారు. బాలకృష్ణతో పాటు ఆయన అల్లుడు, గీతం ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ ఛైర్మన్‌ భరత్‌ కూడా తమ విద్యా సంస్థల తరపున రూ.25లక్షల విరాళాన్ని కేటీఆర్‌కు చెక్‌ రూపంలో అందించారు.

సంపత్‌నంది రూ.5లక్షలు

టాలీవుడ్‌ దర్శకుడు సంపత్‌నంది సైతం కరోనా క్రైసిస్‌ ఛారిటీకి రూ.5 లక్షలు విరాళంగా అందించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని తెలియచేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ ఇళ్లకే పరిమితమవ్వాలని ఆయన సూచించారు.


Tags:
కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)