మంగళవారం, జూన్ 02, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

త్రిష డ్యాన్స్‌అదుర్స్‌..టిక్‌టాక్‌ వీడియో వైరల్‌!

చెన్నై: అగ్ర కథానాయిక త్రిష ఫేమస్‌ వీడియో మేకింగ్‌ ఫ్లాట్‌ఫాం టిక్‌టాక్‌లోకి అడుగుపెట్టారు. ప్రముఖ హాలీవుడ్‌ గాయని మేగాన్ నీ స్టాలియన్ ఆలపించిన ‘సేవేజ్..’కు డ్యాన్స్‌ చేసి.. తొలి వీడియోను పోస్ట్‌ చేశారు. ఊదా రంగు, నలుపు రంగు స్కట్‌లో చేసిన డ్యాన్స్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. దీంతో ఆమె టిక్‌టాక్‌ వీడియో వైరల్‌గా మారింది. ‘వావ్‌ టిక్‌టాక్‌లోకి త్రిష, డ్యాన్స్‌ అదుర్స్‌, సూపర్‌, లుక్‌ క్యూట్‌గా ఉంది..’ అంటూ రకరకాల కామెంట్లు చేశారు. లాక్‌డౌన్‌ కాలాన్ని త్రిష ఇంట్లో తన కుటుంబ సభ్యులు, పెంపుడు జంతువులతో గడుపుతున్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో మూగజీవుల్ని కాపాడమని ప్రజల్ని కోరారు. తన ఇంటి దగ్గరున్న శునకాలకు ఆహారం పెడుతున్న వీడియోలను షేర్‌ చేశారు. అంతేకాదు బోర్‌ కొట్టినప్పుడు స్నేహితులతో కలిసి వీడియో కాల్‌ మాట్లాడుతున్నట్లు తెలిపారు.

ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న భారీ ప్రాజెక్టు ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో త్రిష కీలక పాత్ర పోషించబోతున్నారు. ఇందులో విక్రమ్‌, ఐశ్వర్య రాయ్‌, జయం రవి, కార్తి, శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. త్రిష నటిస్తున్న ‘పరమపదం విలయాట్టు’, ‘రాంగీ’, ‘గర్జనై’, ‘రామ్‌’ సినిమాలు వివిధ దశల్లో ప్రొడక్షన్‌ పనులు జరుపుకొంటున్నాయి.


Tags:
కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)