వివిధ కోర్సులకు ప్రవేశ ప్రకటన
దేశంలో ప్రసిద్ధ, పురాతన, అతిపెద్ద విద్యాసంస్థల్లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ) ఒకటి. విభిన్న అంశాలు, రంగాల్లో విస్తృత స్థాయి కోర్సులు ఈ సంస్థ ప్రత్యేకత. వచ్చే విద్యాసంవత్సరం కోసం వీటిలో ప్రవేశానికి బీహెచ్‌యూ ప్రకటన విడుదల చేసింది. ఇది కేంద్రీయ విశ్వవిద్యాలయం కాబట్టి సీట్ల కోసం ఎవరైనా పోటీ పడవచ్చు. పరీక్షలో ప్రతిభ చూపిస్తే ప్రవేశం లభిస్తుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఇంటర్ విద్యార్థులకు...
బీఏ ఆనర్స్: ఆర్ట్స్, సోషల్ సైన్సెస్
బీకాం ఆనర్స్: జనరల్ కోర్సు, పైనాన్షియల్ మార్కెట్స్ మేనేజ్మెంట్
ఫైన్ ఆర్ట్స్: విజువల్ ఆర్ట్స్
పెర్ఫామింగ్ ఆర్ట్స్: సితార్, ఫ్లూట్, వయోలిన్, తబ్లా, కథక్, భరతనాట్యం, వోకల్
బీఎస్సీ ఆనర్స్: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, జియాలజీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, జాగ్రఫీ, బయాలజీ
వొకేషనల్ కోర్సులు: రిటైల్ అండ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ అండ్ టూరిజం మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్, మోడర్న్ ఆఫీస్ మేనేజ్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ మేనేజ్మెంట్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ.
ఇతరాలు: అగ్రికల్చర్ బీఎస్సీ, వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండ్రీ, బీఏ ఎల్ఎల్బీ, శాస్త్రి ఆనర్స్
అర్హత: ఈ కోర్సులకు ఇంటర్ ఉత్తీర్ణులు, ప్రస్తుతం రెండో సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని కోర్సులకు సంబంధిత విభాగాల్లో విద్యా నేపథ్యం అవసరం.
డిగ్రీ అర్హతతో..
బీఎడ్: లాంగ్వేజెస్, సైన్స్, మ్యాథ్స్, సోషల్ సైన్సెస్/ హ్యుమానిటీస్
బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్: లాంగ్వేజెస్, సైన్స్, మ్యాథ్స్, సోషల్ సైన్సెస్/ హ్యుమానిటీస్ బీపీఈడీ, ఎల్ఎల్బీ.
పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు
ఎంఏ: తెలుగు, ఇంగ్లిష్, హిందీ, కన్నడ, ఉర్దూ, సంస్కృతం, బెంగాళీ, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ కల్చర్ అండ్ ఆర్కియాలజీ, జాగ్రఫీ, స్టాటిస్టిక్స్, మ్యాథ్స్, హోం సైన్స్, లింగ్విస్టిక్స్, నేపాలీ, అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, పర్షియన్, రష్యన్, చైనీస్, ఫిలాసఫీ, ఆర్ట్ హిస్టరీ, పాళీ, ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సైకాలజీ, సోషల్ వర్క్, ఆంత్రపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్, సోషల్ ఎక్స్ క్లూజన్ అండ్ ఇన్‌క్లూజివ్ పాలసీ, ఎనర్జీ ఎకనామిక్స్, హెరిటేజ్ మేనేజ్మెంట్, మాస్ కమ్యూనికేషన్, మ్యూజియాలజీ.
ఎమ్మెస్సీ: ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బోటనీ, కంప్యూటర్ సైన్స్, జాగ్రఫీ, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, సైకాలజీ, హోం సైన్స్, బయో కెమిస్ట్రీ, టెక్ జియో ఫిజిక్స్, జియాలజీ, హెల్త్ స్టాటిస్టిక్స్, అగ్రికల్చర్, డైరీ టెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, అప్లయిడ్ మైక్రో బయాలజీ, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటింగ్, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్, కంప్యుటేషనల్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఫోరెన్సిక్ సైన్స్, అగ్రో ఫారెస్ట్రీ, సాయిల్ వాటర్ కన్జర్వేషన్, ఫుడ్ టెక్నాలజీ, ప్లాంట్ బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ,
ఎంఎఫ్ఎ: పెయింటింగ్, అప్లయిడ్ ఆర్ట్స్, ప్లాస్టిక్ ఆర్ట్స్, పోటరీ అండ్ సిరామిక్స్, టెక్స్టైల్ డిజైన్.
ఎంపీఏ: వోకల్ మ్యూజిక్, డ్యాన్స్.
ఎంఎడ్, ఎంఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఎంఎల్ఐఎస్సీ, మాన్యుస్క్రిప్టాలజీ అండ్ పాలియోగ్రఫీ, ఎంపీఈడీ, ఎల్ఎల్ఎం, ఎంసీఏ, ఎంకాం, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, కార్పొరేట్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్, పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ ఇండ్ర[స్టియల్ రిలేషన్స్, మాస్టర్ ఆఫ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్.
ఎంబీఏ: ఫారిన్ ట్రేడ్, రిస్క్ అండ్ ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అగ్రి బిజినెస్.
మాస్టర్ ఆఫ్ వొకేషన్: రిటైల్ అండ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ అండ్ టూరిజం మేనేజ్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ మేనేజ్మెంట్, మెడికల్ లేబొరేటరీ అండ్ టెక్నాలజీ.
ఆచార్య: శుక్ల యజుర్వేద, కృష్ణ యజుర్వేద, సామవేద, రుగ్వేద, వ్యాకరణ, సాహిత్య, జ్యోతిష్ (గణిత్), జ్యోతిష్ (ఫాలిత్), ధర్మ విజాన్, ఆగమ తంత్ర, ధర్మశాస్త్ర, మీమాంస, జైన దర్శన్, బుద్ద దర్శన్, వేదాంత, పురాణేతిహాస్, సంఖ్య యాగ, ప్రాచీన న్యాయ, న్యాయ వైశేషిక.
అర్హత: కొన్ని కోర్సులకు ఏదైనా డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు. మిగిలినవాటిలో ప్రవేశానికి డిగ్రీలో సంబంధిత సబ్జెక్టు చదివుండాలి.
ఎంపిక విధానం
పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను కోర్సుల్లోకి తీసుకుంటారు. ప్రవేశం ఆశిస్తున్న కోర్సులకు విడిగా దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షలు కూడా దరఖాస్తు చేసుకున్న కోర్సు ప్రకారం మారతాయి. కొన్ని కోర్సుల్లోకి ఉమ్మడిగా పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలన్నీ ఆన్ లైన్లోనే, ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 29
పరీక్షలు: ఏప్రిల్ 26, మే 15 నుంచి 28 వరకు
పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో- హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.ఏపీలో- అనంతపురం, చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
వెబ్సైట్: http://bhuonline.in