TVS Raider 125: భారత్‌లో టీవీఎస్‌ రైడర్‌ 125 విడుదల - tvs raider 125 launched in india prices start at rs 77500
close

Updated : 17/09/2021 07:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TVS Raider 125: భారత్‌లో టీవీఎస్‌ రైడర్‌ 125 విడుదల

 ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ ద్విచక్ర వాహన కంపెనీ టీవీఎస్‌ మోటార్స్‌ సరికొత్త రైడర్‌ 125 సీసీ బైక్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.77,500గా నిర్ణయించింది. స్పోర్ట్స్‌ బైక్‌ లుక్స్‌తో యువతను ఆకర్షించే విధంగా  దీనిని తయారు చేశారు. 125 సీసీ సెగ్మెంట్లో ఇప్పటికే 35 శాతం మంది కొనుగోలుదార్లు యువతే అని కంపెనీ వెల్లడించింది. ప్రపంచ స్థాయి ప్లాట్‌ఫామ్‌పై దీనిని నిర్మించామని టీవీఎస్ పేర్కొంది. ఈ బైక్‌ను భారత్‌తోపాటు  సార్క్‌ దేశాలు, లాటిన్‌ అమెరికా దేశాల్లో కూడా విక్రయించనున్నట్లు కంపెనీ పేర్కొంది. 

టీవీఎస్‌ రైడర్‌ సరికొత్త లుక్స్‌తో తీర్చిదిద్దిన ఈ బైక్‌కు డీఆర్‌ఎల్‌తో అమర్చిన సరికొత్త హెడ్‌ల్యాంప్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.  ఫ్యూయల్‌ ట్యాంక్‌, ఇంజిన్‌ గార్డ్‌ ప్రత్యేక డిజైన్లతో తయారు చేశారు. ఈ బైకుకు అమర్చిన స్ప్లిట్‌ సీట్‌ సౌకర్యవంతంగా ఉండనుంది. దీనికి 17 అంగుళాల అలాయ్‌ వీల్స్‌ ఇచ్చారు. ఈ బైక్‌ మొత్తం పసుపు, ఎరుపు, నలుపు రంగుల్లో రానుంది. రైడర్‌ పూర్తి డిజిటల్‌ కన్సోల్‌ను అమర్చారు. దీనికి మూడు ట్రిప్‌మీటర్లు ఉన్నాయి. గేర్‌షిఫ్ట్‌ ఇండికేటర్‌,సగటు వేగం నమోదు చేసే ఇండికేటర్‌ వంటివి ఉన్నాయి. 

బైకుకు 124.8 సీసీ సింగిల్‌ సిలిండర్‌ 3 వాల్వ్‌ ఇంజిన్‌ను అమర్చారు. 7,500 ఆర్‌పీఎం వద్ద 11.2 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. 6,000 ఆర్పీఎం వద్ద 11.2 బీహెచ్‌పీ టార్క్‌ను విడుదల చేస్తుంది. బైకుకు 5స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను అమర్చారు. దీనిలో ఎకో, పవర్‌ డ్రైవింగ్‌ మోడ్‌లు ఇచ్చారు.  


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని