ఇంటర్నెట్‌డెస్క్: ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ఎలాన్ మస్క్.. ఒక్క ట్వీట్‌తో భారీగా నష్టపోయారు. బిట్కాయిన్లపై ఆయన చేసిన ట్వీట్ వైరల్ కావడంతో కేవలం ఒకే ఒక్క రోజులో ఆయన 15 బిలియన్ డాలర్లు కోల్పోయారు.
క్రిప్టోకరెన్సీపై మస్క్ గతవారం తన ట్విటర్లో స్పందించారు. ‘‘చూస్తుంటే బిట్‌కాయిన్, ఎథర్ క్రిప్టోకరెన్సీ ధర ఎక్కువగా ఉన్నట్లు అన్పిస్తోంది’’ అని పోస్ట్ చేశారు. సాధారణంగా ఎప్పుడూ బిట్‌కాయిన్‌కు అనుకూలంగా మాట్లాడే మస్క్.. ఇలాంటి అభిప్రాయం చెప్పడంతో ఆ ట్వీట్ వైరల్ అయ్యింది. ఇంకేముంది సోమవారం నాటి అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీల్లో టెస్లా షేరు విలువ అమాంతం 8.6శాతం కుంగింది. 2020 సెప్టెంబరు తర్వాత కంపెనీ షేర్లు ఇంత భారీగా పడిపోవడం మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. తాజా పతనంతో మస్క్ నికర సంపద 15.2 బిలియన్ డాలర్లు(అంటే భారత కరెన్సీలో రూ. 1.10లక్షల కోట్లు) తగ్గి 183.4 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ వెల్లడించింది.
గత ఏడాది కాలంగా 400శాతం పెరిగిన క్రిప్టోకరెన్సీ విలువ మస్క్ ట్వీట్ తర్వాత పడిపోయింది. నిజానికి క్రిప్టోకరెన్సీని సపోర్ట్ చేసే మస్క్.. రెండు వారాల క్రితం 1.5 బిలియన్ డాలర్ల విలువ గల బిట్కాయిన్లను కొనుగోలు చేశారు. తమ విద్యుత్ కార్ల విక్రయంలో క్రిప్టోకరెన్సీని కూడా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
ఇవీ చదవండి..
హెరాన్బా ఐపీఓ..మీరు పెట్టుబడి పెట్టొచ్చా?
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?