డిపాజిట్ పరిమితిపై ఆర్బీఐ కీలక నిర్ణయం
పేమెంట్స్ బ్యాంక్‌లలో వినియోగదారుని డిపాజిట్ పరిమితిని ఆర్బీఐ రెట్టింపు చేసింది.
పేమెంట్స్ బ్యాంక్‌లు పొదుపు ఖాతాలు మరియు చెల్లింపు సేవల ద్వారా మరింత ఆర్ధిక లక్ష్యాలను అందుకోవడానికి లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆర్థిక వ్యవస్థల విస్తరణ పెంచడానికి ఆర్బీఐ భారత్‌లో పేమెంట్స్ బ్యాంకులను ప్రవేశపెట్టింది.
పేమెంట్స్ బ్యాంకులు చాలా కాలంగా డిపాజిట్ పరిమితిని పెంచాలని కోరుతున్నాయి. దేశంలో డిజిటల్ చెల్లింపుల బ్యాంకులను ప్రోత్సహించే ప్రయత్నంలో, ఆర్బీఐ బుధవారం పేమెంట్స్ బ్యాంకుల గరిష్ట డిపాజిట్స్‌ను రూ. 2 లక్షలకు పెంచినట్లు ప్రకటించింది. అంతకుముందు ఈ గరిష్ట పరిమితి రూ. 1 లక్ష మాత్రమే.
నవంబర్ 27, 2014న జారీ చేయబడిన పేమెంట్స్ బ్యాంకుల లైసెన్సింగ్ మార్గదర్శకాల ప్రకారం ఒక్కో వినియోగదారుని గరిష్ట బ్యాలెన్స్ రూ. 1 లక్ష కలిగి ఉండటానికి ఆర్బీఐ అనుమతించింది. పేమెంట్స్ బ్యాంకుల పనితీరుపై సమీక్ష ఆధారంగా మరియు వారి ప్రయత్నాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆర్థిక లక్ష్యాల కోసం మరియు ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపారులు, వ్యాపారులతో సహా వారి వినియోగదారుల అవసరాలను తీర్చగల సామర్ధ్యాన్ని విస్తరించడానికి కూడా గరిష్ట పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెంచాలని ఆర్బీఐ నిర్ణయించింది.
పేమెంట్స్ బ్యాంకుల ప్రధాన లక్ష్యం వలస కార్మికులు, తక్కువ ఆదాయ గృహస్తులు, చిన్న వ్యాపారులు, ఇతర అసంఘటిత రంగ సంస్థలు, చిన్న పొదుపు ఖాతాలకు, చెల్లింపులు మరియు ఆర్థిక సేవలను అందించడం.
పేమెంట్స్ బ్యాంకులను ప్రారంభించడానికి 2015 ఆగస్టులో ఆర్బీఐ 11 సంస్థలకు సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. దేశంలో పేమెంట్స్ బ్యాంకును ప్రారంభించిన మొదటిది ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) జనవరి 2017లో 2 పైలట్ బ్రాంచ్‌లలో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇతర పేమెంట్స్ బ్యాంకులలో ప్రధానమైనవి `పేటిఎం` పేమెంట్స్ బ్యాంక్ మరియు `ఫినో` పేమెంట్స్ బ్యాంక్.
ఈ బ్యాంకులన్నీ ప్రస్తుతం సాధారణ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లనే అందిస్తున్నాయి. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం, పేమెంట్స్ బ్యాంకులు ఫిక్స్డ్ లేదా రికరింగ్ డిపాజిట్లను అంగీకరించవు. పేమెంట్స్ బ్యాంకుకు ఎలాంటి రుణం, క్రెడిట్ కార్డు ఇవ్వడానికి అనుమతి లేదు.
ఆర్బీఐ, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) మరియు రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) సౌకర్యాలను డిజిటల్ చెల్లింపుల మధ్యవర్తులకు విస్తరించింది. ఇప్పటి వరకు బ్యాంకులు మాత్రమే ఈ `ఆర్టీజీఎస్` మరియు `నెఫ్ట్` చెల్లింపుల సదుపాయాన్ని ఉపయోగించడానికి అనుమతించబడ్డాయి.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?