టిక్‌టాక్‌‌పై నిషేధం: తాజా కబురు తెలుసా? - govt to continue ban on chinese apps including tiktok
close

Updated : 23/01/2021 23:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టిక్‌టాక్‌‌పై నిషేధం: తాజా కబురు తెలుసా?

దిల్లీ: టిక్‌టాక్‌ సహా ఇతర చైనీస్‌ యాప్‌లపై నిషేధం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేసిందని సమాచారం. నిషేధాజ్ఞలపై మరోసారి సమీక్షించాలని యాప్‌లు కోరగా కుదరదని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు ఇచ్చిందని కీలక వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై టిక్‌టాక్‌ను సంప్రదించగా ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం వాస్తవమేనని ధ్రువీకరించింది.

‘నోటీసులను కూలంకషంగా పరిశీలిస్తున్నాం. సరైన రీతిలో స్పందిస్తాం. 2020, జూన్‌ 29న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేసిన తొలి కంపెనీ టిక్‌టాక్‌. స్థానిక చట్టాలు, నిబంధనలు పాటించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ అభ్యంతరాలను పరిష్కరించేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నాం. మా వినియోగదారుల గోప్యత, సమాచార భద్రతకు మేం తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం’ అని టిక్‌టాక్‌ అధికారి ప్రతినిధి తెలిపారు.

కేంద్రం గతేడాది జూన్‌లో 59, సెప్టెంబర్‌లో 118 చైనీస్‌ యాప్‌లపై నిషేధం విధించింది. ఇందులో టిక్‌టాక్‌, హెలో, పబ్‌జీ సైతం ఉన్న సంగతి తెలిసిందే. భారతీయుల సమాచార భద్రత, గోప్యత, దేశ సౌర్వభౌమత్వానికి భంగం కలుగుతోందని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇవీ చదవండి
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రవిశాస్త్రి హెచ్చరిక..
గాయపడ్డా.. బౌలింగ్‌ ఒప్పుకొన్న కారణమదే!


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని