వ్యాపారులకు రూ.25 లక్షల రుణం: అమెజాన్‌
close

Published : 28/09/2021 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాపారులకు రూ.25 లక్షల రుణం: అమెజాన్‌

ముంబయి: అమెజాన్‌ ఇండియా మార్కెట్‌ప్లేస్‌లో నమోదైన వ్యాపారులు, చిన్న వ్యాపార సంస్థలకు రూ.25 లక్షల వరకు ఓవర్‌డ్రాఫ్ట్‌ (ఓడీ) సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో కరెంటు ఖాతా ఉన్న  వ్యాపారులు తమ నిర్వహణ మూలధన అవసరాల కోసం దీన్ని వాడుకోవచ్చని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇతర బ్యాంకుల ఖాతాదారులూ.. తమ వద్ద కరెంటు ఖాతా ప్రారంభించి, ఈ వెసులుబాటును వినియోగించుకోవచ్చని పేర్కొంది. దరఖాస్తు నుంచి ఓడీ మంజూరు వరకు పూర్తిగా డిజిటల్‌లోనే జరుగుతుందని తెలిపింది. క్రెడిట్‌ బ్యూరోల నుంచి వ్యాపారులు, సంస్థలకు సంబంధించిన ఆర్థిక వివరాల ఆధారంగా ఓడీ మొత్తాన్ని నిర్ణయిస్తుంది. ఎంఎస్‌ఎంఈలు వ్యాపార విస్తరణకు అవసరమైన మూలధనం కోసం ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ పేర్కొంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని