ఏఆర్‌సీలకు ‘మోసపూరిత’ రుణాల బదిలీ
close

Published : 25/09/2021 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏఆర్‌సీలకు ‘మోసపూరిత’ రుణాల బదిలీ

అనుమతించిన ఆర్‌బీఐ

ముంబయి: ‘మోసపూరిత’ రుణాలుగా బ్యాంకులు వర్గీకరించిన వాటిని ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ(ఏఆర్‌సీ)లకు బదిలీ చేయడానికి రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) ఆమోదం తెలిపింది. దీంతో అటువంటి ఖాతాల పరిష్కారానికి మార్గం సుగమం అయినట్లయింది. అదే సమయంలో బదిలీ అనంతరం ఆ ఖాతాలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలకు ఫిర్యాదుల దాఖలు, పరిశీలన, నివేదన వంటి చట్టబద్ధ బాధ్యతలు కూడా ఏఆర్‌సీలకే వెళతాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ‘60 రోజుల కంటే ఎక్కువ కాలంపాటు ఎగవేతకు గురైన రుణాలు లేదా ఎన్‌పీఏలుగా వర్గీకరించిన రుణాలను ఏఆర్‌సీలకు బదిలీ చేయడానికి అనుమతి ఇస్తున్నామ’ని ఆర్‌బీఐ శుక్రవారం సర్క్యులర్‌లో పేర్కొంది. అయితే మోసపూరిత రుణంగా వర్గీకరించిన మొత్తానికి 100 శాతం కేటాయింపులను బ్యాంకులు చేయాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ వార్షిక నివేదిక ప్రకారం.. 2020-21లో రూ.1.37 లక్షల కోట్లు ‘మోసానికి గురైన’ రుణాలుగా బ్యాంకులు వర్గీకరించాయి.


మెడ్‌లీమెడ్‌ అంతర్జాతీయ విస్తరణ

ఈనాడు, హైదరాబాద్‌: ఆరోగ్య సేవల రంగంలోని హైదరాబాద్‌ అంకురం మెడ్‌లీమెడ్‌ అమెరికాతో పాటు మరికొన్ని దేశాల్లో సేవలు అందించబోతున్నట్లు తెలిపింది. ఔషధ దుకాణాలకు సేవలను అందించడంతో పాటు,  టెలిమెడిసిన్‌ సేవలను అందిస్తున్న ఈ సంస్థ ఈ ఏడాది చివరి నాటికి రిటైల్‌ ఫార్మసీ స్టోర్లను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది. ఈ సందర్భంగా అథెనా గ్లోబల్‌ టెక్నాలజీస్‌, మెడ్‌లీమెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.సతీశ్‌ మాట్లాడుతూ.. అసంఘటిత రంగంలో ఉన్న ఔషధ దుకాణాలను ఒక బ్రాండు కిందకు తీసుకొచ్చే ప్రయత్నాలను చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో 20 దుకాణాలతో ఇలాంటి ప్రయత్నాలు చేసినట్లు, త్వరలోనే వీటి సంఖ్య 50కి చేరుకుంటుందన్నారు.


అంకుర సంస్థలకు ప్రోత్సాహం
మైటీతో చేతులు కలిపిన ఏడబ్ల్యూఎస్‌

దిల్లీ: సాంకేతిక ఆవిష్కరణలు చేస్తున్న అంకురాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మైటీ) ఆధ్వర్యంలోని మైటీ స్టార్టప్‌ హబ్‌తో అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌)కు చెందిన అమెజాన్‌ ఇంటర్నెట్‌ సర్వీసెస్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మైటీ హబ్‌, ఏడబ్ల్యూఎస్‌లు కలిసి డీప్‌ టెక్నాలజీ అంకురాలను గుర్తించి, వాటికి అవసరమైన సహాయాన్ని అందిస్తాయి. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, ప్రజా రక్షణ, రవాణా, స్మార్ట్‌ నగరాలు తదితర విభాగాల్లోని అంకురాలకు ఈ సేవలు అందుతాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని