భారత సంస్కరణలు భేష్‌
close

Published : 25/09/2021 02:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత సంస్కరణలు భేష్‌

పెట్టుబడులకు అపార అవకాశాలు
ప్రధాని మోదీతో జరిగిన భేటీలో అమెరికా దిగ్గజ కంపెనీల సీఈఓలు

దిల్లీ: భారత్‌ ఇటీవల చేపట్టిన సంస్కరణలను అమెరికా వ్యాపారాధినేతలు, దిగ్గజ కంపెనీలు సీఈఓలు ప్రశంసించారని విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్ష్‌ వర్ధన్‌ శ్రింగ్లా వెల్లడించారు. భారత్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని వివరించారు. అమెరికా పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా సీఈఓలు వేర్వేరుగా సమావేశమై భారత్‌లో పెట్టుడులు పెట్టే అంశంపై చర్చించారు. ‘ఉదయం నుంచి దిగ్గజ కంపెనీల సీఈఓలు, వ్యాపారాధినేతలతో సమావేశాలు జరుగుతున్నాయి. భారత్‌ చేపడుతున్న సంస్కరణలను వాళ్లు ప్రశంసించారు. భారత్‌, అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడితే ఇరుదేశాల ప్రజలకు ప్రయోజనం ఉంటుందని’ మోదీ ట్వీట్‌ చేశారు. ప్రధానితో భేటీ అయిన సీఈఓల్లో శాంతను నారాయణ్‌ (అడోబ్‌), వివేక్‌ లాలా (జనరల్‌ అటామిక్స్‌), క్రిస్టియానో ఇ అమోన్‌ (క్వాల్‌కామ్‌), మార్క్‌ విడ్మార్‌ (ఫస్ట్‌ సోలార్‌), స్టీఫెన్‌ ఏ స్కావార్మన్‌ (బ్లాక్‌స్టోన్‌) ఉన్నారు. 5జీ అనుసంధానత, డిజిటల్‌ ఇండియా కార్యక్రమాలపై క్వాల్‌కామ్‌ సీఈఓ చర్చించారు. విద్యా సాంకేతికత, అంకురాలు, ఆవిష్కరణలు, యువత కోసం యానిమేషన్‌ లాంటి అంశాలపై అడోబ్‌ సీఈఓ మాట్లాడారు. స్వచ్ఛ హైడ్రోజన్‌ కార్యక్రమంపై ఫస్ట్‌ సోలార్‌ సీఈఓతో, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంపై జనరల్‌ అటామిక్స్‌ సీఈఓ చర్చించారు. భారత్‌లో పెట్టుబడుల అవకాశాలపై బ్లాక్‌ స్టోన్‌ గ్రూపు సీఈఓ మాట్లాడారు. యువత, విద్యార్థులకు అధునాతన సాంకేతికతల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందనే విషయంపై ప్రధాని చర్చించారని హర్ష్‌వర్ధన్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని