న్యాయ, లావాదేవీ సలహాదారుల ఎంపికకు 30న ఇంటర్వ్యూలు
close

Published : 25/09/2021 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

న్యాయ, లావాదేవీ సలహాదారుల ఎంపికకు 30న ఇంటర్వ్యూలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు అయిదేసి  సంస్థలతో షార్ట్‌లిస్ట్‌ సిద్ధం

ఈనాడు, దిల్లీ: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రారంభించడానికి న్యాయ, లావాదేవీ సలహాదారుల ఎంపిక ప్రక్రియలో కేంద్ర ఆర్థికశాఖ మరో ముందడుగు వేసింది. ఈ రెండు వ్యవహారాల కోసం బిడ్డింగ్‌ చేసిన సంస్థల నుంచి అయిదింటిని షార్ట్‌లిస్ట్‌ చేసి ఈనెల 30న ఇంటర్వ్యూలకు ఆహ్వానించింది. న్యాయ సలహాదారుగా సేవలందించడానికి దిల్లీకి చెందిన చాందియోక్‌ అండ్‌ మహాజన్‌, కొచ్చర్‌ అండ్‌ కంపెనీ, లింక్‌లీగల్‌ సంస్థలు, ముంబయి నుంచి ఎకనామిక్‌ లాస్‌ ప్రాక్టీస్‌, గురుగ్రామ్‌ నుంచి జె.సాగర్‌ అసోసియేట్స్‌ సంస్థలు ఆసక్తి వ్యక్తం చేశాయి. లావాదేవీ సలహాదారుగా సేవలందించడానికి డెలాయిట్‌, ఎర్నెస్ట్‌ అండ్‌ ఎంగ్‌, జేఎం ఫైనాన్షియల్‌ లిమిటెడ్‌, ఆర్‌బీఎస్‌ఏ కేపిటల్‌ అడ్వైజర్స్‌ ఎల్‌ఎల్‌పీ-ఎంఎస్‌ఎంఈ-స్మాల్‌, ఎస్‌బీఐ కేపిటల్‌ మార్కెట్‌ లిమిటెడ్‌లు ముందుకొచ్చాయి. ఈ పది సంస్థలు ఈనెల 30న దృశ్యమాధ్యమ పద్ధతిలో తమ ప్రజెంటేషన్లు ఇవ్వనున్నాయి. ఒక్కో సంస్థ 10-15 నిమిషాల్లో తమ సామర్థ్యాలను వివరించనున్నాయి. ఇందులో సాంకేతిక అర్హత సాధించిన వారి నుంచి ఫైనాన్షియల్‌ బిడ్లను ప్రభుత్వం ఆహ్వానిస్తుంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని