శ్రీసిటీలో డైకిన్‌ ఏసీల తయారీ పరిశ్రమ
close

Published : 25/09/2021 02:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రీసిటీలో డైకిన్‌ ఏసీల తయారీ పరిశ్రమ

శ్రీసిటీ (వరదయ్యపాళెం), న్యూస్‌టుడే: జపాన్‌కు చెందిన ఏసీల తయారీ దిగ్గజ సంస్థ డైకిన్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ డైకిన్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో 75 ఎకరాలలో కొత్త ప్లాంటు నెలకొల్పనుంది. ఇప్పటికే సంస్థకు దేశంలో 2 ప్లాంట్లు ఉండగా, ఇది మూడోది. శ్రీసిటీలో భూమి లీజు హక్కు పత్రాలపై డైకిన్‌ ప్రతినిధులు సంతకాలు చేశారు. డైకిన్‌ ఇండియా ఎండీ, సీఈవో కన్వల్‌జిత్‌ మాట్లాడుతూ.. దక్షిణ అమెరికా, ఆఫ్రికా మార్కెట్లకు ఏసీలు, విడిభాగాలను ఎగుమతి చేసేందుకు ఇది ప్రాంతీయ కేంద్రంగా ఉపయోగపడేలా చేయాలన్నదే తమ ప్రణాళికన్నారు. దేశంలో కెల్లా వ్యాపార అనుకూల వాతావరణం, ఉత్తమ మౌలిక, రవాణా వసతులు ఉన్న శ్రీసిటీని తమ పెట్టుబడి గమ్యంగా ఎంచుకున్నామని తెలిపారు. 2023లో ఉత్పత్తి ప్రారంభించే ఈ యూనిట్‌ ద్వారా 3 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు వివరించారు. శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ.. రిఫ్రిజిరేటర్‌, ఏసీ రంగంలో ప్రఖ్యాతిగాంచిన డైకిన్‌ గ్రూపు సంస్థ దక్షిణ భారతదేశంలో తొలి ఉత్పత్తి కేంద్రాన్ని శ్రీసిటీలో నెలకొల్పడం హర్షణీయమన్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కింద లబ్ధి పొందేందుకూ డైకిన్‌ దరఖాస్తు చేసింది. ఈ ప్లాంటుపై సంస్థ రూ.800-1000 కోట్లు పెట్టుబడి పెడుతుందని అంచనా.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని