రెండేళ్లలో మరో 250 విక్రయశాలలు
close

Published : 25/09/2021 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండేళ్లలో మరో 250 విక్రయశాలలు

బిగ్‌ సి ప్రచారకర్తగా మహేశ్‌ బాబు

ఈనాడు, హైదరాబాద్‌: మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌  విక్రయ సంస్థ బిగ్‌ సి రెండేళ్లలో మరో 250 విక్రయశాలలను ప్రారంభించే ప్రణాళికల్లో ఉంది. ఇప్పటికే ఈ సంస్థకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులలో కలిసి 250 స్టోర్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించడంతో పాటు, తమిళనాడులో ఇప్పుడున్న 20 స్టోర్లను 100కు చేరుస్తామని, కర్ణాటకలోనూ కొత్తగా ప్రారంభిస్తామని బిగ్‌ సి ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.బాలు చౌదరి వెల్లడించారు. సినీ నటుడు మహేశ్‌ బాబును బిగ్‌ సి ప్రచార కర్తగా నియమించుకున్న సందర్భంగా శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కొత్త స్టోర్లపై రూ.100 కోట్ల వరకు పెట్టుబడి పెడతామన్నారు. 30వేలు జనాభా ఉన్న చిన్న పట్టణాల్లోనూ తమ స్టోర్లు అందుబాటులోకి రానున్నాయన్నారు. ప్రస్తుతం 2వేల మంది ఉద్యోగులుండగా, ఇంకో 500 మందిని  నియమించుకుంటున్నట్లు పేర్కొన్నారు. బిగ్‌ సి స్టోర్లలో టీవీలు, స్మార్ట్‌ వాచీలు కూడా అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే ల్యాప్‌టాప్‌లూ విక్రయించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నామని, 2022-23లో రూ.1,500 కోట్లకు చేరాలన్నది ప్రణాళికగా వివరించారు. రూ.2వేల కోట్ల టర్నోవర్‌ దాటాక పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని