4 నుంచి అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌
close

Published : 25/09/2021 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

4 నుంచి అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌

ఈనాడు, హైదరాబాద్‌: పండుగలను దృష్టిలో పెట్టుకుని, వినియోగదారుల కోసం ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’ పేరిట ప్రత్యేక విక్రయాలు చేపట్టనున్నట్లు అమెజాన్‌ ఇండియా ప్రకటించింది. అక్టోబరు 4 నుంచి ప్రారంభం కానుంది. చిన్న విక్రేతలు, స్థానిక దుకాణదారులు వ్యాపారంలో పుంజుకునేందుకు గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ ఉపయోగపడుతుందని అమెజాన్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ మనీశ్‌ తివారి అన్నారు. దేశ వ్యాప్తంగా 75వేలకు పైగా స్థానిక దుకాణాలు, 8.5 లక్షల మందికి పైగా విక్రేతలు అందించే వస్తువులు ఈ సేల్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, ఈఎంఐ కొనుగోళ్లపై 10శాతం రాయితీ లభించనుంది. అమెజాన్‌ బిజినెస్‌పై వ్యాపార కొనుగోళ్లపైనా భారీ రాయితీలు ఉండబోతున్నాయని తివారీ వెల్లడించారు.

భారత్‌లో ప్రైమ్‌ వీడియో ఛానళ్లు: భారత్‌లో ప్రైమ్‌ వీడియో ఛానళ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ వేదికలను ప్రైమ్‌ నుంచే వీక్షించే వెసులుబాటు ఉంటుంది. డిస్కవరీ+, లయన్స్‌ గేట్‌ ప్లే, ఎరోస్‌ నౌ తదితర 8 ఓటీటీలు ఇకపై నేరుగా ప్రైమ్‌లోనే యాడ్‌ ఆన్‌ సేవలుగా అందుబాటులో ఉండనున్నాయి.

3 నుంచి మింత్రా బిగ్‌ ఫ్యాషన్‌ ఫెస్టివల్‌
ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన దుస్తుల ఇ-కామర్స్‌ సంస్థ మింత్రా అక్టోబరు 3-10 తేదీల్లో బిగ్‌ ఫ్యాషన్‌ ఫెస్టివల్‌ పేరుతో ప్రత్యేకంగా విక్రయాలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో 11లక్షల మందికి పైగా కొత్త వినియోగదారులు పాల్గొనే అవకాశం ఉందని మింత్రా పేర్కొంది. దాదాపు 7వేలకు పైగా బ్రాండ్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని