క్రిప్టోకరెన్సీ లావాదేవీలు చట్టవిరుద్ధం
close

Published : 25/09/2021 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రిప్టోకరెన్సీ లావాదేవీలు చట్టవిరుద్ధం

చైనా కేంద్ర బ్యాంక్‌ ప్రకటన

బీజింగ్‌: బిట్‌కాయిన్‌, ఇతర వర్చువల్‌ కరెన్సీలతో కూడిన లావాదేవీలు చట్టవిరుద్ధమని చైనా కేంద్ర బ్యాంక్‌ శుక్రవారం ప్రకటించింది. డిజిటల్‌ కరెన్సీల అనధికార వినియోగాన్ని నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. క్రిప్టోకరెన్సీలను నిర్వహించకుండా 2013లోనే చైనా బ్యాంకులపై నిషేధం విధించారు. కానీ ప్రభుత్వం ఈ ఏడాది మరోసారి ప్రకటన చేసింది. అయితే ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలో క్రిప్టోకరెన్సీ మైనింగ్‌, ట్రేడింగ్‌ ఇంకా జరుగుతుందని, పరోక్షంగా ఇది ముప్పు తీసుకురావొచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. బిట్‌కాయిన్‌, ఇధేరియం, ఇతర డిజిటల్‌ కరెన్సీలు ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయని, మనీ లాండరింగ్‌, ఇతర నేరాల్లో వినియోగిస్తారన్న ఫిర్యాదులు వచ్చినట్లు చైనా కేంద్ర బ్యాంక్‌ అయిన పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా పేర్కొంది. వర్చువల్‌ కరెన్సీ డెరివేటివ్‌ కాంట్రాక్టులన్నీ చట్టవిరుద్ధమని, వాటిని నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది. చైనా కేంద్ర బ్యాంక్‌ ప్రకటన నేపథ్యంలో బిట్‌కాయిన్‌ విలువ 9 శాతానికి పైగా పతనమై 41,085 డాలర్లకు చేరింది. ఇథేరియం 10% కుంగి 3100 డాలర్ల నుంచి 2800 డాలర్లకు పడింది.


చైనా నుంచి ఔషధ ఏపీఐ దిగుమతులపై సుంకం!

దిల్లీ: చైనా నుంచి దిగుమతి చేసుకునే ముడిఔషధం (సెఫ్ట్రియాక్సోన్‌ సోడియమ్‌ స్టెరైల్‌)పై యాంటీ డంపింగ్‌ సుంకం విధించేందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది. చైనా చౌక దిగుమతుల నుంచి దేశీయ కంపెనీల ప్రయోజనాలను పరిరక్షించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. చైనా నుంచి ఔషధాల ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇంగ్రీడియెంట్‌)లు తక్కువ ధరకే దిగుమతి అవుతుండటం వల్ల దేశీయ పరిశ్రమపై ప్రభావం పడుతోందనే విషయం డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ రెమిడీస్‌ (డీజీటీఆర్‌) పరిశీలనలో తేలింది. నెక్టార్‌ లైఫ్‌ సైన్సెస్‌, స్టెరైల్‌ ఇండియా ఫిర్యాదు మేరకు ఈ దర్యాప్తును చేసింది. తదుపరి ఔషధ ఏపీఐలపై యాంటీ డంపింగ్‌ సుంకం విధింపునకు నిర్ణయం తీసుకున్నట్లు డీజీటీఆర్‌ వెల్లడించింది. ఒక కిలో ఏపీఐకు 12.91 డాలర్లు సుంకం విధించేందుకు ప్రతిపాదించింది. దీనిపై ఆర్థిక శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని