నిఫ్టీ @ 17500
close

Published : 16/09/2021 03:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిఫ్టీ @ 17500

తాజా జీవనకాల గరిష్ఠాలకు సూచీలు
టెలికాం, వాహన షేర్ల పరుగులు
రూ.259.68 లక్షల కోట్లకు మదుపర్ల సంపద
సమీక్ష

బుల్‌ మళ్లీ విజృంభించింది. ప్రభుత్వం ప్యాకేజీలు ప్రకటించడంతో టెలికాం, వాహన కంపెనీల షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. దీంతో సెన్సెక్స్‌, నిఫ్టీ తాజా గరిష్ఠాలను అధిరోహించాయి. రూపాయి బలపడటం, విదేశీ పెట్టుబడుల జోరు కూడా కలిసొచ్చాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 18 పైసలు పెరిగి 73.50 వద్ద ముగిసింది.

మదుపర్ల సంపదగా పరిగణించే  బీఎస్‌ఈలో నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ గత రెండు రోజుల్లో రూ.3.35 లక్షల కోట్లు పెరిగి తాజా గరిష్ఠమైన రూ.259.68 లక్షల కోట్లకు చేరింది.
సెన్సెక్స్‌ ఉదయం 58,354.11 పాయింట్ల వద్ద దూకుడుగా ప్రారంభమైంది. రోజంతా కొనుగోళ్ల మద్దతు స్థిరంగా కొనసాగడంతో అదే జోరు కొనసాగించిన సూచీ.. ఇంట్రాడేలో 58,777.06 పాయింట్ల వద్ద తాజా జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 476.11 పాయింట్ల లాభంతో 58,723.20 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 139.45 పాయింట్లు రాణించి 17,519.45 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,532.70 వద్ద కొత్త రికార్డు గరిష్ఠాన్ని నమోదుచేసింది.

భారతీ ఎయిర్‌టెల్‌ 4.53%, వొడాఫోన్‌ ఐడియా 2.76%, టాటా టెలి 4.94%, టాటా కమ్యూనికేషన్స్‌ 1.38% లాభాలు పొందాయి.

ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్ల దూకుడుకు కళ్లెం పడింది. ప్రముఖ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాటాకు చెందిన రేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, బోఫా సెక్యూరిటీస్‌లు కంపెనీలో వాటా కొనుగోలు చేయడంతో షేరు ఇంట్రాడేలో 12.86% పెరిగి రూ.295.15 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 2.12 శాతం తగ్గి రూ.255.95 వద్ద ముగిసింది.  

సెన్సెక్స్‌ 30 షేర్లలో 20 లాభపడ్డాయి. ఎన్‌టీపీసీ 7.16%, టైటన్‌ 3.09%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2.86%, ఎస్‌బీఐ 2.49%, పవర్‌గ్రిడ్‌  2.21%, టీసీఎస్‌ 1.79%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.67%, ఇన్ఫోసిస్‌ 1.49% చొప్పున రాణించాయి.

200 బి.డాలర్ల సంస్థగా టీసీఎస్‌

టీసీఎస్‌ షేరు బుధవారం ఇంట్రాడేలో రూ.3980 వద్ద గరిష్ఠానికి చేరడంతో, సంస్థ మార్కెట్‌ విలువ పరంగా 200 బిలియన్‌ డాలర్ల (సుమారు  రూ.14.70 లక్షల కోట్ల) మైలురాయిని అందుకుంది. యాక్సెంచర్‌ (216 బి.డాలర్లు), రిలయన్స్‌ (205 బి.డాలర్లు) మాత్రమే ఇప్పటివరకు ఈ ఘనత సాధించాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి షేరు రూ.3954.80కి పరిమితం కావడంతో, కంపెనీ మార్కెట్‌ విలువ 199.1 బి.డాలర్ల (సుమారు రూ.14.62 లక్షల కోట్ల)కు చేరింది. మొదటి 100 బి.డాలర్లను అందుకోవడానికి కంపెనీకి 50 ఏళ్లు సమయం పట్టగా.. తర్వాతి 100 బి.డాలర్లను మూడున్నరేళ్లలోనే అందుకుంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని