హైదరాబాద్‌లో ఎస్పెరర్‌ కేన్సర్‌ పరిశోధనా కేంద్రం
close

Published : 16/09/2021 03:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హైదరాబాద్‌లో ఎస్పెరర్‌ కేన్సర్‌ పరిశోధనా కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: క్లినికల్‌ న్యూట్రిషన్‌ సేవల సంస్థ ఎస్పెరర్‌ న్యూట్రిషన్‌ హైదరాబాద్‌లో కేన్సర్‌ న్యూట్రిషన్‌ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. న్యూట్రిషన్‌ ఆధారిత చికిత్సల ద్వారా కేన్సర్‌, ఇతర తీవ్రమైన వ్యాధులను నివారించడం, అదుపు చేయడం కోసం అనువైన ల్యాబ్‌/ క్షేత్రస్థాయి పరిశోధనలను ఈ కేంద్రం నిర్వహిస్తుంది. మనదేశంలో ఇటువంటి తొలి పరిశోధనాశాల ఇదేనని ఎస్పెరర్‌ న్యూట్రిషన్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ రక్తిమ్‌ చటోపాధ్యాయ్‌ తెలిపారు. మనదేశంలో కేన్సర్‌, ఇతర నాన్‌-కమ్యూనికబుల్‌ వ్యాధుల తీవ్రత పెరిగిపోతోందని, ఇటువంటి వ్యాధులను అరికట్టడంలో పోషక పదార్థాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. పోషకాహార లోపం వల్ల మనదేశంలో కేన్సర్‌ బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు ఇటీవల ‘గ్లోబల్‌ న్యూట్రిషన్‌ రిపోర్ట్‌’ వెల్లడించడాన్ని ప్రస్తావించారు. దేశంలో ఏటా 8 లక్షల మంది కేన్సర్‌ బారిన పడుతున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితులపై తాము పూర్తిస్థాయిలో పరిశోధనలు చేపట్టి, తగిన పరిష్కార మార్గాలు సూచిస్తామని పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని