ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ నష్టం రూ.630 కోట్లు
close

Published : 01/08/2021 03:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ నష్టం రూ.630 కోట్లు

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ రూ.630 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. కరోనా మలి విడత ప్రభావాన్ని తట్టుకోవడానికి కేటాయింపు చర్యలను చేపట్టడంతో ఆ మేరకు నష్టం వాటిల్లింది. గతేడాది ఇదే మూడు నెలల కాలంలో రూ.93.55 కోట్లు; మార్చి 2021తో ముగిసిన త్రైమాసికంలో రూ.127.81 కోట్లు చొప్పున ఈ బ్యాంకు నికర లాభాన్ని నమోదు చేయడం విశేషం. ఇక నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ), ఫీజుల ఆదాయం రాణించడంతో మొత్తం ఆదాయం 36% వృద్ధితో రూ.3,034 కోట్లకు చేరుకుంది. జూన్‌ 30, 2021 నాటికి స్థూల, నికర నిరర్థక ఆస్తులు వరుసగా 4.61%; 2.32% చొప్పున నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో అవి వరుసగా 1.99%; 0.51% చొప్పున మాత్రమే ఉన్నాయి.

గృహ రుణాలపై దృష్టి: ‘తక్కువ కాసా వ్యయాల కారణంగా మేం ఇక గృహ రుణ వ్యాపారంలో పాలుపంచుకోవాలని భావిస్తున్న’ట్లు బ్యాంకు ఎండీ, సీఈఓ వి. వైద్యనాథన్‌ పేర్కొన్నారు. రాబోయే మూడు త్రైమాసికాల్లో కేటాయింపులు తగ్గుతాయని అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని