4 ఏళ్లలో 70 విమానాలు
close

Published : 29/07/2021 02:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

4 ఏళ్లలో 70 విమానాలు

చౌకధరల విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌కు ఝున్‌ఝున్‌వాలా ప్రణాళిక

దిల్లీ: భారత్‌లో కొత్తగా చౌకధరల విమానయాన సంస్థను ప్రారంభించడానికి ప్రముఖ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా సన్నాహాలు చేస్తున్నారు. విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య గణనీయంగా పెరగొచ్చని అంచనాతో ఈ సంస్థ కోసం వచ్చే నాలుగేళ్లలో 70 విమానాలు సమకూర్చుకోవాలన్నది  ఝున్‌ఝున్‌వాలా ప్రణాళిక. కొత్త సంస్థలో ఝున్‌ఝున్‌వాలా 35 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.260 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నారు. సంస్థలో ఆయనకు 40 శాతం వాటా ఉంటుంది. వచ్చే 15 రోజుల్లో భారత విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ఈ సంస్థ నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) పొందే అవకాశం ఉన్నట్లు టీవీ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ఈ చౌక ధరల విమానయాన సంస్థకు ‘ఆకాశ ఎయిర్‌’గా నామకరణం చేయనున్నారు. సంస్థ బృందంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌ మాజీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ చేరతారని, 180 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన విమానాల కోసం చూస్తున్నట్లు ఝున్‌ఝున్‌వాలా తెలిపారు.

ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న దేశీయ విమానయాన మార్కెట్‌లో అవకాశాలు బాగా ఉన్నాయని, తక్కువ ఛార్జీలు అందించే విమానయాన సంస్థతో దూసుకెళ్లాలని ఝున్‌ఝున్‌వాలా భావిస్తున్నారు. ఫోర్బ్స్‌ గణాంకాల ప్రకారం.. ఝున్‌ఝున్‌వాలా నికర సంపద దాదాపు 460 కోట్ల డాలర్లుగా ఉంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని