భారీ నష్టాలు తప్పాయ్‌
close

Updated : 29/07/2021 07:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారీ నష్టాలు తప్పాయ్‌

సమీక్ష

బ్యాంకింగ్‌, ఇంధన, వాహన షేర్లు కుదేలవ్వడంతో వరుసగా మూడో రోజూ మార్కెట్లు డీలాపడ్డాయి. అయితే దిగువ స్థాయుల్లో కొనుగోళ్లు రావడంతో భారీ నష్టాల నుంచి మార్కెట్లు తప్పించుకోగలిగాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పరపతి సమీక్ష నిర్ణయాలు వెలువడనుండటంతో మదుపర్లు అప్రమత్తత పాటించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు కోలుకుని 74.38 వద్ద ముగిసింది. 

సెన్సెక్స్‌ ఉదయం 52,673.69 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అయితే వెంటనే నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఇంట్రాడేలో దాదాపు 770 పాయింట్లు కుదేలై 51,802.73 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. అనంతరం కొనుగోళ్ల మద్దతు లభించడంతో కోలుకుని 135.05 పాయింట్ల నష్టంతో 52,443.71 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 37.05 పాయింట్లు తగ్గి 15,709.40 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 15,513.45 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని నమోదుచేసింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని