ఇండిగో నష్టం రూ.3,174 కోట్లు
close

Published : 28/07/2021 03:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇండిగో నష్టం రూ.3,174 కోట్లు

దిల్లీ: ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.3,174 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ రూ.2,844 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో ఏకీకృత మొత్తం ఆదాయం రూ.1,143 కోట్ల నుంచి 177.2 శాతం వృద్ధితో రూ.3,170 కోట్లకు చేరింది. ‘కొవిడ్‌ రెండో దశ పరిణామాల వల్ల ఆదాయాలు బాగా తగ్గాయి.  మే, జూన్‌లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోవడమే ఇందుకు కారణమ’ని కంపెనీ సీఈఓ రోనోజాయ్‌ దత్తా వెల్లడించారు. కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో జులై, ఆగస్టుల బుకింగ్‌లలో రికవరీ చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని