గ్లెన్‌మార్క్‌ లైఫ్‌సైన్సెస్‌ ఇష్యూకు 2.78 రెట్ల స్పందన
close

Published : 28/07/2021 03:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గ్లెన్‌మార్క్‌ లైఫ్‌సైన్సెస్‌ ఇష్యూకు 2.78 రెట్ల స్పందన

దిల్లీ: గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఇష్యూకు తొలి రోజు 2.78 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 1,50,18,279 షేర్లు జారీ చేయనుండగా 4,17,79,260 షేర్లకు బిడ్‌లు దాఖలయ్యాయి. సంస్థాగతేతర మదుపర్ల విభాగంలో 86 శాతం షేర్లకు బిడ్‌లు దాఖలవ్వగా.. చిన్న మదుపర్ల విభాగంలో 5.17 రెట్ల బిడ్‌లు దాఖలయ్యాయి. ఈ ఇష్యూలో రూ.1,060 కోట్ల కొత్త షేర్లతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో 63 లక్షల షేర్లను కంపెనీ విక్రయిస్తోంది. ఇష్యూకు ధరల శ్రేణిగా రూ.695- 720ను నిర్ణయించారు. గరిష్ఠ ధర ప్రకారం.. ఈ ఇష్యూ ద్వారా కంపెనీకి రూ.1,513.60 కోట్లు సమకూరే అవకాశం ఉంది. యాంకర్‌ ఇన్వెస్ట నుంచి రూ.454 కోట్లు సమీకరించింది కూడా. రేపటితో (29న) ఇష్యూ ముగియనుంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని