భారతీయ సినిమా, మీడియా వ్యాపారాలపై అమెజాన్‌ ఆసక్తి!
close

Updated : 28/07/2021 03:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారతీయ సినిమా, మీడియా వ్యాపారాలపై అమెజాన్‌ ఆసక్తి!

ఐనాక్స్‌ లీజర్‌లో వాటా కొనుగోలు యత్నాలు?

బెంగళూరు: భారతీయ సినిమా, మీడియా వ్యాపారాల్లోకి అడుగు పెట్టేందుకు అమెజాన్‌ ఇండియా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే వివిధ కంపెనీలతో చర్చలు సాగిస్తున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. మల్టీప్లెక్స్‌ సినిమా హాళ్లు నిర్వహిస్తున్న ఐనాక్స్‌ లీజర్‌లో వాటా కొనుగోలుకు అమెజాన్‌ యత్నిస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఐనాక్స్‌ షేరు మంగళవారం ఒక దశలో 14% మేర పెరిగి రూ.347.50 స్థాయిని తాకింది. చివరకు 5.86% లాభంతో రూ.320.65 వద్ద ముగిసింది. అయితే ఈ వార్తలపై ఐనాక్స్‌ స్పందిస్తూ ‘వాటా విక్రయంపై అమెజాన్‌ ఇండియాతో ఎలాంటి చర్చలు జరగలేద’ని పేర్కొంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని