టాటా మోటార్స్‌ నష్టం రూ.4,450 కోట్లు
close

Published : 27/07/2021 04:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాటా మోటార్స్‌ నష్టం రూ.4,450 కోట్లు

దిల్లీ: ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో టాటా మోటార్స్‌ నికర నష్టం ఏకీకృత ప్రాతిపదికన సగానికి పైగా తగ్గి రూ.4,450.12 కోట్లకు పరిమితమైంది. 2020-21 ఇదే కాలంలో నికర నష్టం రూ.8,443.98 కోట్లు. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.31,983.06 కోట్ల నుంచి పెరిగి రూ.66,406.05 కోట్లకు చేరింది. జూన్‌ త్రైమాసికానికి టాటా మోటార్స్‌ స్టాండలోన్‌ పద్ధతిలో రూ.1,320.74 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. కిందటేడాది ఇదే సమయంలో నికర నష్టం రూ.2,190.64 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల ఆదాయం రూ.2,686.87 కోట్ల నుంచి పెరిగి రూ.11,904.19 కోట్లకు చేరింది. సమీక్షా త్రైమాసికంలో ఎగుమతులు సహా మొత్తం అమ్మకాలు 351.40 శాతం పెరిగి 1,14,170 వాహనాలుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంతో చూస్తే ఈసారి అమ్మకాలు తగ్గాయని, కొవిడ్‌-19 రెండోదశ నియంత్రణకు చేపట్టిన లాక్‌డౌన్‌ ఆంక్షలు ఇందుకు కారణమయ్యాయని వివరించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని