బైజూస్‌ చేతికి అమెరికా సంస్థ ఎపిక్‌
close

Published : 22/07/2021 02:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బైజూస్‌ చేతికి అమెరికా సంస్థ ఎపిక్‌

దిల్లీ: చిన్న పిల్లలు ఆన్‌లైన్‌లో పుస్తకాలు చదువుకునేందుకు వీలు కల్పించే అమెరికా సంస్థ ఎపిక్‌ను దేశీయ ఎడ్యుటెక్‌ సంస్థ బైజూస్‌ కొనుగోలు చేసింది. లావాదేవీ విలువ సుమారు రూ.3,730 కోట్లు (500 మిలియన్‌ డాలర్లు). ఎపిక్‌కు ప్రపంచవ్యాప్తంగా వినియోగదార్లుగా ఉన్న 20 లక్షల మంది ఉపాధ్యాయులు, 5 కోట్ల మంది పిల్లలకు తాము చేరువయ్యేందుకు ఈ కొనుగోలు దోహదం చేస్తుందని బైజూస్‌ పేర్కొంది. అమెరికాలో తన కార్యకలాపాల విస్తరణకూ తోడ్పడుతుందని వివరించింది.నేర్చుకోవడంపై పిల్లల్లో ఆసక్తి పెంచాలనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఉత్తర అమెరికాలో అదనంగా 1 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.7500 కోట్లు) పెట్టుబడిగా పెట్టనున్నట్లు  బైజూస్‌ సీఈఓ, వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌ తెలిపారు.  ప్రపంచవ్యాప్తంగా 40,000కి పైగా విశేష ఆదరణ పొందిన పుస్తకాలు ఎపిక్‌ ప్లాట్‌ఫాంపై అందుబాటులో ఉన్నాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని