కనిష్ఠాల నుంచి పరుగులు
close

Published : 22/06/2021 02:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కనిష్ఠాల నుంచి పరుగులు

సమీక్ష

దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి తప్పించుకోగలిగాయి. అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ.. హెచ్‌డీఎఫ్‌సీ జంట, ఎస్‌బీఐ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు మార్కెట్‌ను లాభాల వైపు నడిపించాయి.

సెన్సెక్స్‌ ఉదయం 51,887.55 పాయింట్ల వద్ద భారీ నష్టాల్లో ప్రారంభమైంది. అదే ధోరణి కొనసాగిస్తూ.. ఇంట్రాడేలో 51,740.19 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. అక్కడ నుంచి బలంగా పుంజుకున్న సూచీ.. మధ్యాహ్నం తర్వాత లాభాల్లోకి వచ్చింది. రోజులో 600 పాయింట్ల మధ్య కదలాడిన సెన్సెక్స్‌ చివరకు 230.01 పాయింట్ల లాభంతో 52,574.46 వద్ద ముగిసింది. నిఫ్టీ 63.15 పాయింట్లు పెరిగి 15,746.50 దగ్గర స్థిరపడింది. .

భారీ క్షీణత తర్వాతఅదానీ
గ్రూప్‌ షేర్లు మెరిశాయి. అదానీ పోర్ట్స్‌  5.19% లాభంతో రూ.730.65; అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 3.55 శాతం లాభంతో రూ.1540.70 వద్ద ముగిశాయి. అదానీ ట్రాన్స్‌మిషన్‌ 5%, అదానీ పవర్‌ 4.96%, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 5%, అదానీ టోటల్‌ గ్యాస్‌ 5% చొప్పున దూసుకెళ్లి అప్పర్‌ సర్క్యూట్‌ దగ్గర స్థిరపడ్డాయి.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 21 లాభపడ్డాయి. ఎన్‌టీపీసీ 3.87%, టైటన్‌ 1.87%, ఎస్‌బీఐ 1.64%, హెచ్‌యూఎల్‌ 1.42%, అల్ట్రాటెక్‌ 1.31%, టాటా స్టీల్‌ 1.30% రాణించాయి. మారుతీ   0.82%, టీసీఎస్‌ 0.74%, టెక్‌ మహీంద్రా 0.71% డీలాపడ్డాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని