బీవీఆర్‌ మోహన్‌రెడ్డికి రూ.2 కోట్ల ప్రతిఫలం
close

Published : 22/06/2021 02:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బీవీఆర్‌ మోహన్‌రెడ్డికి రూ.2 కోట్ల ప్రతిఫలం

ఏజీఎంలో తీర్మానాన్ని తిరస్కరించిన వాటాదార్లు

హైదరాబాద్‌: సైయెంట్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు, ప్రస్తుతం కంపెనీ డైరెక్టర్ల బోర్డులో నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అయిన బీవీఆర్‌ మోహన్‌రెడ్డికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2 కోట్ల ప్రతిఫలం చెల్లించాలన్న ప్రతిపాదన కంపెనీ ఏజీఎం (వాటాదార్ల వార్షిక సమావేశం) లో వీగిపోయింది. దీన్ని ప్రత్యేక తీర్మానం (స్పెషల్‌ రిజల్యూషన్‌) గా దీన్ని ప్రవేశపెట్టగా, అనుకూలంగా 70.63 శాతం ఓట్లు, వ్యతిరేకంగా 29.37 శాతం ఓట్లు వచ్చాయి. ప్రత్యేక తీర్మానం ఆమోదం పొందాలంటే 75 శాతం ఓట్లు అవసరం. దీనికి ఆమేరకు ఓట్లు రానందున వీగిపోయినట్లు అవుతోంది. బీవీఆర్‌ మోహన్‌రెడ్డి ఇటీవల వరకు కంపెనీకి ఛైర్మన్‌గా ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు బాధ్యతలు నిర్వర్తించి ఇటీవలే ఛైర్మన్‌ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో సైయెంట్‌ లిమిటెడ్‌ బోర్డు ఛైర్మన్‌గా ఎం.ఎం.మురుగప్పన్‌ నియమితులయ్యారు. ఛైర్మన్‌ పదవిని వదులుకున్న బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, ఆ తర్వాత బోర్డులో నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా చేరారు. కంపెనీలో ప్రమోటర్లకు ప్రస్తుతం దాదాపు 24 శాతం వాటా ఉంది. సంస్థాగత మదుపరులు, రిటైల్‌ మదుపరుల వద్ద మిగిలిన 76 శాతం వాటా ఉంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని