జూనియర్లకు సెప్టెంబరు నుంచి వేతన పెంపు: విప్రో
close

Updated : 19/06/2021 20:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జూనియర్లకు సెప్టెంబరు నుంచి వేతన పెంపు: విప్రో

ఈ ఏడాదిలో రెండోసారి

దిల్లీ: జూనియర్‌ ఉద్యోగులకు సెప్టెంబరు 1 నుంచి వేతనాలు పెంచుతామని ఐటీ సేవల దిగ్గజం విప్రో శుక్రవారం ప్రకటించింది. ‘అసిస్టెంట్‌ మేనేజర్‌ అంత కంటే తక్కువ స్థాయి బ్యాండ్‌ బీ3 ఉద్యోగుల్లో అర్హులకు మెరిట్‌ శాలరీ ఇంక్రీజెస్‌ (ఎంఎస్‌ఐ) ఇవ్వనున్నాం. జనవరిలో ఈ బ్యాండ్‌లోని అర్హులైన ఉద్యోగులందరికీ వేతనాలు పెంచాం. దాదాపు 80 శాతం మంది ఉద్యోగులు ఈ జాబితాలో ఉన్నారు. మళ్లీ సెప్టెంబరులో వేతనాలు పెంచుతున్నాం. అంటే ఒకే క్యాలెండర్‌ ఏడాదిలో రెండోసారి అవుతుంద’ని విప్రో వెల్లడించింది. గతంలో ప్రకటించినట్లే సీ1 బ్యాండ్‌ పైన ఉన్న అర్హులైన ఉద్యోగులందరికీ (మేనేజర్‌, అంత కంటే ఉన్నత స్థాయి) జూన్‌ 1 నుంచి వేతన పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. విప్రోలో ఉద్యోగులను వారి పని అనుభవం ద్వారా 5 బ్యాండ్లలో (ఏ నుంచి ఈ) సబ్‌ ర్యాంకింగ్‌లతో విభజిస్తుంటారు. కంపెనీలో పని చేస్తున్న 1.97 లక్షల మంది సిబ్బందిలో బీ3 బ్యాండ్‌ వరకు (జూనియర్స్‌) ఉన్న వారే అత్యధికం. బీ3 బ్యాండ్‌ వరకు ఉన్న ఉద్యోగుల్లో మంచి ప్రదర్శన కనబరిచిన వారికి గత ఏడాది డిసెంబరులోనే విప్రో పదోన్నతులు కూడా కల్పించింది. దేశీయంగా 8-9 శాతం, ఆన్‌షోర్‌లో చేస్తున్న వారికి 4-5 శాతం చొప్పున సగటు ఇంక్రిమెంటు ఉంటుందని, బాగా పనిచేసిన వారికి వేతన పెంపు ఎక్కువగా ఉంటుందని తెలిపింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని