రూ.25,500-29,200 కోట్ల
close

Published : 11/06/2021 02:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.25,500-29,200 కోట్ల

పబ్లిక్‌ ఇష్యూకు అదానీ ఎయిర్‌పోర్ట్స్‌!

దిల్లీ: దేశీయ కుబేరుల్లో రెండో స్థానంలో ఉన్న గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ హోల్డింగ్స్‌ రూ.25,500-29,200 కోట్ల పబ్లిక్‌ ఇష్యూకు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనికి సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని వార్తలొస్తున్నాయి. గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ నుంచి విమానాశ్రయాల వ్యాపారాన్ని విడదీసి ఐపీఓకు వచ్చేందుకు గౌతమ్‌ అదానీ ప్రణాళిక సిద్ధం చేశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2010లో బొగ్గు వ్యాపారంతో మొదలుపెట్టి నౌకాశ్రయాలు, గనులు, విద్యుత్‌ ప్లాంట్లు, విమానాశ్రయాల నిర్వహణ, రక్షణ, డేటా సెంటర్ల ఏర్పాటు వంటి రంగాల్లోకి ఆయన అడుగులు వేశారు. కొత్త కొత్త వ్యాపారాలు చేస్తూ దేశంలోనే రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు.2019లో అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ ద్వారా విమానాశ్రయ వ్యాపారంలోకి గౌతమ్‌ అదానీ అడుగుపెట్టారు. లఖ్‌నవూ, అహ్మదాబాద్‌, తిరువనంతపురం, మంగళూరు, జయపుర, గువాహటి విమానాశ్రయాల్ని ఆధునికీకరించడంతో సహా, కొన్నేళ్లపాటు నిర్వహించే ప్రాజెక్టును దక్కించుకున్నారు. ముంబయి విమానాశ్రయాన్ని కూడా అదానీయే నియంత్రిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని