30 ఏళ్లపాటు ఆదాయం కోసం...
close

Updated : 23/06/2021 17:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

30 ఏళ్లపాటు ఆదాయం కోసం...

జీవితంలోని వివిధ దశల్లో క్రమం తప్పకుండా ఆదాయం అందించే పాలసీని ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ విడుదల చేసింది. ఈ విజన్‌ లైఫ్‌ ఇన్‌కం ప్లస్‌ ప్లానులో పొదుపు, జీవిత బీమా కలిసి ఉంటాయి. పాలసీదారుడు తన అవసరాలకు తగ్గట్టుగా ఈ పాలసీని తీసుకునే వీలుంది. బెనిఫిట్‌ ఆప్షన్‌లో షార్ట్‌ టర్మ్‌ ఇన్‌కం ఆప్షన్‌ను ఎంచుకున్నప్పుడు 10 ఏళ్లపాటు హమీతో కూడిన ఆదాయాన్ని నెలనెలా అందిస్తుంది. 45 ఏళ్ల లోపు ఉన్న వారు అదనపు ఆదాయం కావాలనుకున్నప్పుడు దీన్ని ఎంచుకోవచ్చు. 20, 25, 30 ఏళ్లపాటు ఏడాదికోసారి ఆదాయం రావాలనుకునే వారు లాంగ్‌ టర్మ్‌ ఇన్‌కం ఆప్షన్‌ను తీసుకోవచ్చు. ఇక జీవితాంతం వరకూ అంటే.. 85 ఏళ్లు.. లేదా 100 ఏళ్లు వచ్చేదాకా ఏడాదికోసారి ఆదాయం అందాలి అనుకునే వారికోసం హోల్‌ లైఫ్‌ ఆప్షన్‌ ఉంది. బోనస్‌ను పెయిడప్‌ అడిషన్స్‌గా ప్రకటిస్తారు. ఇది అత్యవసర నిధిగా ఉపయోగపడుతుంది. పాలసీ మొదటి ఏడాది నుంచి అవసరమైనప్పుడు ఇందులో నుంచి పాక్షికంగా లేదా మొత్తం వెనక్కి తీసుకునే వీలు కల్పిస్తారు. బీమా 100 ఏళ్ల వయసు వరకూ ఉంటుంది. పాలసీ వ్యవధిలో పాలసీదారుడికి ఏదైనా జరిగితే.. నామినీకి పాలసీ విలువను చెల్లిస్తారు. పాలసీదారుడు తన అవసరాలకు అనుగుణంగా రైడర్లను ఎంచుకునే వీలునూ ఈ పాలసీ కల్పిస్తోంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని