కార్పొరేట్లు.. కొవిడ్‌ సాయం
close

Published : 17/05/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కార్పొరేట్లు.. కొవిడ్‌ సాయం

* విద్యుత్‌ మంత్రిత్వ శాఖ కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్‌యూలు) 200కు పైగా ప్రాంతాల్లో కొవిడ్‌ కేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. అలాగే విద్యుత్‌ సీపీఎస్‌యూలు పీఎం కేర్స్‌ నిధికి రూ.925 కోట్ల మేర సాయం అందించాయి.
* భారత్‌లో వినియోగదార్లకు 9,000 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను అందించేందుకు విక్రేతలు వాటిని కొనుగోలు చేసేందుకు అమెజాన్‌ తోడ్పాటు అందిస్తోంది. తొలి విడతగా 1,000 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను భారత్‌కు రప్పించింది. ఈ నెలాఖరుకు మిగతావి కూడా రావొచ్చని తెలుస్తోంది.
* కొత్తగా ట్రాక్టర్లు కొనుగోలు చేసిన రైతులకు రూ.1 లక్ష చొప్పున ఆరోగ్య బీమా కల్పిస్తున్నట్లు ఎంఅండ్‌ఎం తెలిపింది.
* హరియాణాలోని పానిపట్‌లో 500 పడకల సామర్థ్యంతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ప్రారంభించినట్లు ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) వెల్లడించింది.
* గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న ఆసుపత్రులకు 2 ఆక్సిజన్‌ జనరేటింగ్‌ యూనిట్లను పంపించినట్లు ఎల్‌అండ్‌టీ తెలిపింది.
* కొవిడ్‌-19 రోగులకు రోజుకు సుమారు 6,650 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను ఉక్కు పరిశ్రమలు, చమురు శుద్ధి కేంద్రాల నుంచి సరఫరా చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు.
* బోరోసిల్‌ సంస్థ కొవిడ్‌తో మరణించిన తమ నలుగురు ఉద్యోగుల కుటుంబాలకు రెండేళ్ల వేతనాలను ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే వారి పిల్లల చదువుకు (గ్రాడ్యుయేషన్‌) అయ్యే ఖర్చుల్ని భరిస్తామని పేర్కొంది.
* కొవిడ్‌తో మరణించిన తమ ఉద్యోగుల కుటుంబాలకు 24 నెలల వేతనాలతో సహా (నెలకు రూ.2 లక్షల వరకు) ఇద్దరు పిల్లల చదువులకు ఒక్కొక్కరి ఏడాది రూ.లక్ష చొప్పున (12వ తరగతి వరకు), గ్రాడ్యుయేషన్‌లో ఏడాదికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు బజాజ్‌ ఆటో తెలిపింది.
* కొవిడ్‌తో చనిపోయిన తమ ఉద్యోగుల కుటుంబాలకు రెండేళ్ల వేతనాలతో సహా వారి చిన్నారులకు గ్రాడ్యుయేషన్‌ వరకు అయ్యే ఖర్చుల్ని భరిస్తామని సన్‌ ఫార్మా వెల్లడించింది.
* కొవిడ్‌తో చనిపోయిన తమ ఉద్యోగుల కుటుంబాలకు స్థూల వార్షిక వేతనానికి 3 రెట్ల మొత్తం అందించడంతో సహా వారి పిల్లల చదువులకు ఆర్థిక సాయం చేస్తామని టీవీఎస్‌ మోటార్‌ వెల్లడించింది.
* కొవిడ్‌తో మరణించిన తమ ఉద్యోగుల కుటుంబాలకు 12 నెలల వేతనం అందిస్తామని స్థిరాస్తి దిగ్గజం లోధా గ్రూప్‌ వెల్లడించింది.
* కొవిడ్‌తో మరణించిన తమ ఉద్యోగి కుటుంబానికి 3 నెలలు పూర్తి వేతనం, ఆ తరవాత రెండేళ్లపాటు 50 శాతం వేతనం అందించడంతో సహా ఆ కుటుంబంలోని చిన్నారుల చదువులకు సాయం అందిస్తామని రెన్యూ పవర్‌ పేర్కొంది.
* కొవిడ్‌ నేపథ్యంలో తమ 35,000 మంది భారతీయ ఉద్యోగుల కోసం 3.8 మిలియన్‌ డాలర్ల నిధిని ఏర్పాటు చేసినట్లు జేపీ మోర్గాన్‌ ఆసియా-పసిఫిక్‌ హెడ్‌ పిలిప్పో గోరి వెల్లడించారు.
* కొవిడ్‌ సోకిన తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల్ని భరిస్తామని ఐటీసీ తెలిపింది.
* కొవిడ్‌ సోకిన తమ ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు హోమ్‌ కేర్‌ సేవలు అందించడంతో సహా 7 నగరాల్లో ఆసుపత్రులు నిర్వహిస్తున్న హోటళ్లలోనూ (క్వారంటైన్‌ గదులు) అవసరమైతే ఉండేందుకు అవకాశం కల్పించామని అసెంచర్‌ తెలిపింది.
* మైసూర్‌లో తమ సిబ్బంది కోసం కొవిడ్‌ ఐసొలేషన్‌ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ వెల్లడించింది.


* ఒడిశాలోని సహీద్‌ లక్ష్మణ్‌ నాయక్‌ హాస్పిటల్‌కు  నేషనల్‌ అల్యూమినియం కంపెనీ(నాల్కో) రూ.1.16 కోట్ల విరాళం ఇచ్చింది.
* మధ్యప్రదేశ్‌ ప్రభుత్వానికి హిందుస్థాన్‌ కాపర్‌ 10 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను ఇచ్చింది. రాజస్థాన్‌, జార్ఖండ్‌లలోనూ ఆక్సిజన్‌తో కూడిన కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది.
* హరియాణాలోని గురుగ్రామ్‌లో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు వేదాంతా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1000 క్రిటికల్‌ కేర్‌ పడకలను ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని