రూ.1.3 లక్షల కోట్ల ఆదాయానికి గండి
close

Published : 17/05/2021 04:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.1.3 లక్షల కోట్ల ఆదాయానికి గండి

ప్రభుత్వం సాయం చేయాలి
హోటళ్ల పరిశ్రమ విజ్ఞప్తి

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2020-21)లో కరోనా కారణంగా భారత హోటళ్ల పరిశ్రమ రూ.1.3 లక్షల కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయిందని భారత హోటల్‌, రెస్టారెంట్ల సంఘాల సమాఖ్య(ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ) పేర్కొంది. ఆతిథ్య రంగం కుప్పకూలకుండా తక్షణం ప్రభుత్వం సాయం చేయాలని కోరుతూ ప్రధానికి, కొంత మంది కేంద్ర మంత్రులకు లేఖ రాసినట్లు ఆ సమాఖ్య ఆదివారమిక్కడ వెల్లడించింది. ‘2019-20లో హోటళ్ల పరిశ్రమకు రూ.1.82 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. మా అంచనాల ప్రకారం గతేడాది 75 శాతానికి పైగా ఆదాయం కొట్టుకుపోయింది. అది రూ.1.3 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉండొచ్చ’ని ఒక ప్రకటనలో పేర్కొంది. వ్యాపారాలు మూతపడుతున్నాయని, మొండి బకాయిలు బాగా పెరుగుతున్నాయని తెలిపింది. ఈఎమ్‌ఐలు, వడ్డీ చెల్లింపులపై మారటోరియం విధించకపోతే ఈ రంగం మొత్తం కుప్పకూలే అవకాశం ఉందని సమాఖ్య వైస్‌ప్రెసిడెంట్‌ గురుబక్షిస్‌ సింగ్‌ కోహ్లి పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ సమయం మొత్తానికి పన్నులు, నీటి, విద్యుత్‌, ఎక్సైజ్‌ లైసెన్సు ఫీజులను రద్దు చేయాలని కోరారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని