5.5 కోట్ల మందికి ఎయిర్‌టెల్‌ ఉచిత ఆఫర్‌
close

Published : 17/05/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

5.5 కోట్ల మందికి ఎయిర్‌టెల్‌ ఉచిత ఆఫర్‌

దిల్లీ: ఎయిర్‌టెల్‌ తన 5.5 కోట్ల అల్పాదాయ వినియోగదార్లకు రూ.49 రీఛార్జ్‌ ప్యాక్‌ను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. ఈ కరోనా సమయంలో వారు తమ సన్నిహితులతో అనుసంధానమై ఉండేందు కోసం ఈ ఆఫర్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్యాక్‌తో 28 రోజుల పాటు చెల్లుబాటు అయ్యేలా రూ.38 టాక్‌టైమ్‌; 100 ఎమ్‌బీ డేటా అందుతుంది. ఈ ఆఫర్‌ విలువ రూ.270 కోట్లని తెలిపింది. మరో వైపు, అదనంగా రూ.79తో రీఛార్జ్‌ కూపన్‌ కొనుగోలు చేసిన వారు రెట్టింపు ప్రయోజనాలూ పొందొచ్చని తెలిపింది. ఈ రెండు ప్రయోజనాలూ ప్రీ పెయిడ్‌ వినియోగదార్లకు ఈ వారంలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని