ఏసీ విక్రయాలపై కొవిడ్‌ దెబ్బ
close

Published : 17/05/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏసీ విక్రయాలపై కొవిడ్‌ దెబ్బ

దిల్లీ: వరుసగా రెండో ఏడాదీ ఎయిర్‌ కండిషనర్లు (ఏసీలు), రిఫ్రిజిరేటర్ల విక్రయాలపై కొవిడ్‌ మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. స్థానిక లాక్‌డౌన్‌లు, పరిమితుల నేపథ్యంలో ఏప్రిల్‌, మేలో ఏసీల విక్రయాలు దారుణంగా దెబ్బతిన్నాయి. వోల్టాస్‌, డైకిన్‌, బ్లూస్టార్‌, పానసోనిక్‌, హయర్‌ వంటి ప్రముఖ కంపెనీలు 2019 ఏప్రిల్‌తో పోలిస్తే గత నెలలో తమ విక్రయాలు 75 శాతం తగ్గాయని పేర్కొన్నాయి. ఈ నెలలో అయితే ఏకంగా విక్రయాలు దాదాపు నిలిచిపోయాయని తెలిపాయి. రెండో దశ విజృంభణే ఇలా ఉంటే, మూడో దశ కూడా ఉంటుందని వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో వినియోగదార్ల సెంటిమెంట్‌ మరింత దెబ్బ తింటోందని, పరిస్థితులు చక్కబడేంత వరకు మన్నికైన వినిమయ వస్తువుల జోలికి వారు వెళ్లేలా కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధిని అంచనా వేసుకున్నా, ఇప్పుడు లక్ష్యాన్ని సవరించుకుంటున్నట్లు ఎండీ, సీఈఓ ప్రదీప్‌ బక్షి వెల్లడించారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని