close

Published : 19/04/2021 02:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పామోలిన్‌లో అమ్మకాలు!

కమొడిటీస్‌
ఈ వారం
 బంగారం, వెండి

పసిడి జూన్‌ కాంట్రాక్టు ఈవారం మరింతగా రాణించాలంటే రూ.47,886 స్థాయిని అధిగమించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే కాంట్రాక్టు రూ.48,149 వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఎంసీఎక్స్‌ బుల్‌డెక్స్‌ ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.14,566 కంటే దిగువన ట్రేడ్‌ కాకుంటే రూ.14,988: రూ.15,151 వరకు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. వెండి మే కాంట్రాక్టుకు ఈవారం రూ.66,899 స్థాయి కీలకం కానుంది. ఈ స్థాయి కంటే కిందకు వస్తే కాంట్రాక్టు మరోమారు దిద్దుబాటు అయ్యేందుకు అవకాశం ఉంటుంది.  
  ప్రాథమిక లోహాలు
* ఎంసీఎక్స్‌ మెటల్‌డెక్స్‌ మే కాంట్రాక్టు ఈవారం రూ.14,242 కంటే దిగువన ట్రేడ్‌ అయితే రూ.14,007 వరకు దిద్దుబాటు అవుతుందని భావించవచ్చు. రాగి ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.703.75 స్థాయికి దిగువన కదలాడితే ప్రతికూల ధోరణికి ఆస్కారం ఉంటుంది. సీసం ఏప్రిల్‌ కాంట్రాక్టుకు ఈవారం రూ.167.85 లక్ష్యంతో రూ.163.65 సమీపంలో లాంగ్‌ పొజిషన్లు తీసుకోవచ్చు.  జింక్‌ ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.229.25 కంటే ఎగువన ట్రేడ్‌ కాకుంటే అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది.
అల్యూమినియం ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.191.25 స్థాయిని అధిగమించకుంటే దిద్దుబాటు అయ్యే వీలుంది.  
 ఇంధన రంగం
* సహజవాయువు ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.193.05 కంటే దిగువన ట్రేడయితే రూ.189.50 వరకు పడిపోతుందని భావింవచ్చు. ముడి చమురు ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.4,558 కంటే దిగువన ట్రేడ్‌ కాకుంటే.. లాంగ్‌ పొజిషన్ల వైపు మొగ్గు చూపొచ్చు. ముడి పామోలిన్‌ నూనె (సీపీఓ) ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్నందున లాంగ్‌ పొజిషన్లున్న ట్రేడర్లు రూ.1,194 సమీపంలో లాభాలు స్వీకరించడం మంచిది.
వ్యవసాయ ఉత్పత్తులు
* పసుపు మే కాంట్రాక్టు ఈవారం రూ.7,796 కంటే కింద ట్రేడ్‌ అయితే, రూ.7,745: రూ.7,593 వరకు పడిపోయే అవకాశం ఉంది.  జీలకర్ర మే కాంట్రాక్టు ఈవారం రూ.14,361- రూ.14,073 వరకు దిద్దుబాటు కావచ్చు.  

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని