మేఘా చమురు డ్రిల్లింగ్ రిగ్గులు
దేశీయ పరిజ్ఞానంతో ప్రైవేటు రంగంలో తొలి తయారీ
గుజరాత్లోని కల్లోల్ క్షేత్రంలో తవ్వకాలకు వినియోగం
ఈనాడు, హైదరాబాద్: చమురు తవ్వకాల్లో వినియోగించే డ్రిల్లింగ్ రిగ్గులను పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి ప్రైవేటు రంగ సంస్థగా మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అవతరించింది. గుజరాత్ రాష్ట్రంలోని కలోల్ చమురు క్షేత్రంలో తవ్వకాల కోసం మొదటి డ్రిల్లింగ్ రిగ్గును ఓఎన్జీసీకి ఈ సంస్థ అందించింది. బుధవారం ఈ రిగ్గుతో తవ్వకాలు ప్రారంభించారు. 1500 హెచ్పీ సామర్థ్యం కల ఈ డ్రిల్లింగ్ రిగ్గు భూ ఉపరితలం నుంచి 4000 మీటర్ల లోతు వరకు చమురు బావులు తవ్వగలదని, దాదాపు 40 ఏళ్ల పాటు పనిచేస్తుందని ఎంఈఐఎల్ ఉపాధ్యక్షుడు రాజేష్ రెడ్డి తెలిపారు. అత్యాధునిక హైడ్రాలిక్ సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని తయారు చేసినట్లు, విద్యుత్తు కూడా పొదుపుగా వినియోగిస్తుందని వివరించారు.
47 రిగ్గులకు రూ.6000 కోట్లు
ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓఎన్జీసీ కి 47 డ్రిల్లింగ్ రిగ్గులు సరఫరా చేసే కాంట్రాక్టును 2019లో ఎంఈఐఎల్ సొంతం చేసుకుంది. ఈ కాంట్రాక్టు విలువ రూ.6,000 కోట్లు. ఇందులో భాగంగా తొలి రిగ్గును ఎంఈఐఎల్ తాజాగా ఓఎన్జీసీకి అందించింది. దాంతో కలోల్ చమురు క్షేత్రంలో తవ్వకాలు ప్రారంభించారు. మిగిలిన 46 రిగ్గుల తయారీ వివిధ దశల్లో ఉన్నట్లు ఎంఈఐఎల్ పేర్కొంది. ప్రైవేటు రంగంలో ఇంత భారీగా రిగ్గుల తయారీ చేపట్టడం ఒక రికార్డుగా సంస్థ పేర్కొంది. ఓఎన్జీసీకి సరఫరా చేయాల్సిన 47 రిగ్గుల్లో, 20 వర్కోవర్ రిగ్గులు. ఇప్పటికే తవ్విన చమురు క్షేత్రాల్లో మిగిలిపోయిన నిక్షేపాలను సైతం వెలికి తీయడానికి వర్కోవర్ రిగ్గులు అవసరం. సాధారణ రిగ్గులు ఈ పనిచేయలేవు. ఓఎన్జీసీకి అందించాల్సిన మిగతా రిగ్గుల్లో రెండు రాజమండ్రి చమురు క్షేత్రంలో అసెంబ్లింగ్ దశలో ఉన్నాయి. మిగిలిన రిగ్గులను తమిళనాడు, త్రిపుర, అస్సాం రాష్ట్రాల్లో ఓఎన్జీసీకి చమురు క్షేత్రాలు ఉన్న చోట అందించాల్సి ఉంది.
చమురు డ్రిల్లింగ్ రిగ్గుల కోసం ఇంతకాలం మనం ఇతరదేశాలపై ఆధారపడవలసి వచ్చిందని, ఇకపై ఆ అవసరం లేదని రాజేష్ రెడ్డి వివరించారు. చమురు బావుల తవ్వకాల్లో వినియోగించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మనదేశంలో అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా తాము ముందుకు సాగుతున్నామని తెలిపారు.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?