ఏసీ-ఎల్ఈడీ తయారీకీ ప్రోత్సాహకాలు
అయిదేళ్లలో రూ.10,700 కోట్ల మేర లబ్ధి
ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో రెండు రంగాలకు రూ.10,700 కోట్ల మేర ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాలను ప్రకటించింది. ఎయిర్ కండీషనర్లు (ఏసీ), ఎల్ఈడీ బల్బులతో కూడిన వైట్గూడ్స్ ఒకటి కాగా, సోలార్ పీవీ మాడ్యూల్స్ రెండోది.
మొత్తం 4 లక్షల ఉద్యోగాలు: వైట్గూడ్స్ రంగానికి అయిదేళ్లలో రూ.6,238 కోట్ల ప్రోత్సాహకాలు అందిస్తామని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఫలితంగా రూ.7,920 కోట్ల అదనపు పెట్టుబడులకు వెసలుబాటు లభిస్తుందని చెప్పారు. దీనివల్ల దేశీయంగా రూ.1.68 లక్షల కోట్ల విలువైన ఏసీలు, ఎల్ఈడీల ఉత్పత్తి జరుగుతుందని, రూ.64,400 కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అవుతాయని పేరొన్నారు. ఈ వస్తువుల అమ్మకాలపై 4 - 6% ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఏసీ విభాగంలో 25-75 శాతం వరకు; ఎల్ఈడీ లైట్ల విభాగంలో 40-45 శాతం వరకు విలువ జోడించవచ్చని పేరొన్నారు. రూ.49,300 కోట్ల ఆదాయం పెరుగుతుందని, 4 లక్షల మేర ఉద్యోగాల కల్పన జరుగుతుందని పేరొన్నారు.
10,000 మెగావాట్ల ప్లాంట్లు: సౌర పీవీమాడ్యూల్స్ రంగానికి అయిదేళ్లలో రూ.4,500 కోట్లు అందించనున్నట్లు వెల్లడించారు. ఇందువల్ల 10,000 మెగావాట్ల సామర్థ్యంతో సౌర పీవీ తయారీ ప్లాంట్లు-రూ.17,200 కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్ర మంత్రి పేరొన్నారు. ప్రత్యక్షంగా 30,000, పరోక్షంగా 1.2 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. దీనివల్ల యేటా రూ.17,500 కోట్ల దిగుమతులు తగ్గుతాయని విశ్లేషించారు.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?