వాహన ధరలో చేర్చొద్దు
ఐఆర్డీఏఐ ప్యానల్ ప్రతిపాదన
దిల్లీ: వాహనం కొనుగోలు చేయడానికి వెళితే, ఇప్పటి వరకు ‘వాహన ధరతో పాటు బీమా ప్రీమియం ఇంత’ అని చెప్పి డీలరు వసూలు చేసుకుంటున్నారు. తదుపరి బీమా మొత్తాన్ని సదరు డీలరు తన ఖాతా నుంచి బీమా కంపెనీకి చెల్లిస్తున్నారు. ఇందువల్ల బీమా ప్రీమియం కింద కొనుగోలుదారు నుంచి కంపెనీ నిర్ణయించిన మొత్తమే వసూలు చేస్తున్నారా, అదనంగా అనేది తెలియడం లేదు. అందుకే ఇకపై వాహన ధరను మాత్రమే కొనుగోలుదారు నుంచి డీలర్ లేక వాహన బీమా సేవల ప్రొవైడర్ (ఎమ్ఐఎస్పీ) వసూలు చేయాలని బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ప్యానల్ ప్రతిపాదించింది. వాహన ప్రీమియంను కొనుగోలుదారు నేరుగా బీమా కంపెనీకి చెల్లించాల్సి ఉంటుంది. ఇందువల్ల వాహన కొనుగోలుదార్లకు ముఖ్యంగా తొలిసారి వాహనం తీసుకునే వారికీ స్పష్టత లభిస్తుందని భావిస్తున్నారు. బీమా కింద ఎంత చెల్లిస్తున్నాం, బీమా కవరేజీ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి.. రాయితీలున్నాయా.. వంటివీ కొనుగోలుదారు పరిశీలించుకునే వీలు లభిస్తుంది. బీమా ప్రీమియం కింద కొనుగోలుదారు చెల్లించిన మొత్తాన్ని తమ ఖాతాకు మళ్లించి, తరవాత తమ ఖాతా నుంచి బీమా కంపెనీకి ఎమ్ఐఎస్పీ చెల్లించే ప్రస్తుత విధానాన్ని నిలిపివేయాలని సూచించింది. ఈ ప్రతిపాదనల్ని ఐఆర్డీఏఐ ఆమోదిస్తే, కొనుగోలుదార్లు బీమా ప్రీమియం, వాహన ధరలను వేర్వేరుగా చెల్లించాల్సి వస్తుంది.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?